SAKSHITHA NEWS

ములుగు జిల్లా :
ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో వలసల పర్వం ఊపందుకుంది. ఒక పార్టీలో అసంతృప్తితో ఉన్న నేతలు వేరే పార్టీలోకి జంప్ అవుతున్నారు. వేరే పార్టీల నుంచి హామీలు లభిస్తే గోడ దూకేందుకు రెడీ అవుతున్నారు.

అధికార పార్టీ బీఆర్ఎస్‌లో అసంతృప్తితో ఉన్న నేతలు, టికెట్ ఆశించి భంగపడ్డ నేతులు వేరే పార్టీలవైపు చూస్తున్నారు. కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరేందుకు అడుగులు వేస్తున్నారు.

ఈ క్రమంలో బీఆర్ఎస్‌కు మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి చందూలాల్ కుమారుడు డాక్టర్ ఆజ్మీరా ప్రహ్లాద్ కాషాయ కండువా కప్పుకోనున్నారు. గత కొంతకాలంగా ఆయన బీఆర్ఎస్‌లో అసంతృప్తితో ఉన్నారు.

దీంతో ఇప్పుడు ఎన్నికల వేళ బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 12న ఆయన కమలం గూటికి చేరనున్నారు. ఆ రోజు ములుగులో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి,. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు…


SAKSHITHA NEWS