అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేసిన ఏఐవైఎఫ్ అమిత్ షాను భర్తరఫ్ చేయాలని డిమాండ్
సాక్షిత వనపర్తి
జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కొంతసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. దహనం చేసేందుకు తయారుచేసిన దిష్టిబొమ్మను అంబేద్కర్ చౌక్ లోనే కార్యకర్తలు రహస్య ప్రదేశంలో ఉంచారు. దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకునేందుకు రంగ ప్రవేశం చేసిన పోలీసులు దిష్టిబొమ్మలను కాల్చొద్దని పోలీసులు నేతలకు నచ్చచెప్పుతుండగానే,ఒక పోలీస్ కానిస్టేబుల్ రహస్య ప్రదేశంలో కార్యకర్తలు ఉంచిన దిష్టిబొమ్మను గుర్తించి తీసుకొని పరుగు తీయటం నాయకులు, కార్యకర్తలు గమనించి కానిస్టేబుల్ వెంట పరుగులు తీశారు.దిక్కుతోచని కానిస్టేబుల్ పక్కనే ఉన్న డ్రైనేజీలో దిష్టిబొమ్మను పడేసి వెళ్లిపోయారు. నాయకులు కార్యకర్తలు మురుగు కాలువలు లో ఉన్న దిష్టిబొమ్మ వద్దనే కొంతసేపునిరసన తెలిపారు. అంతటితో ఆగక మరో దిష్టిబొమ్మను తయారుచేసి దహనం చేసేందుకు సిద్ధం బాగా పోలీసులు మళ్లీఅభ్యంతరం తెలిపారు. అయితేపోలీసుల కళ్ళుగప్పి అంబేద్కర్ చౌక్ లోనే దిష్టిబొమ్మను దహనం చేశారు. కాలుతున్న దిష్టిబొమ్మ కొంత భాగాన్ని పోలీసులు ఎత్తుకెళ్లారు. మొదట తయారుచేసి ఉంచిన అమిత్ షా దిష్టిబొమ్మను పోలీసులు ఎత్తుకెళ్లడంపై అభ్యంతరం తెలుపుతూ నాయకులుపోలీసులతో వాగ్వాదానికి దిగారు. దిష్టిబొమ్మను కాల్చేందుకు చట్టపరంగా అనుమతి లేకుంటే తమను అరెస్టు చేయాలని, దిష్టిబొమ్మను ఎత్తుకెళ్లటం ఇదేం పద్ధతిని ప్రశ్నించారు.
బడుగుల దేవుడు, ఆశాజ్యోతి అంబేద్కర్.. అమిషాను భర్తరఫ్ చేయాలి: నేతలు
దేశంలో బడుగు వర్గాల దేవుడు ఆశాజ్యోతి బాబా సాహెబ్ అంబేద్కర్ అని ఆయనను అవహేళన చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాను మంత్రి పదవి నుంచి తొలగించాలని సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్, ఏఐటీయూసీ జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎండి కుతుబ్ డిమాండ్ చేశారు. వారు మాట్లాడుతూ.. అమిత్ షా చెబుతున్న దేవుడు ఎవరికి ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలు సమాజంలో గౌరవంగా తలెత్తుకు బతుకుతున్నాయని ఉద్ఘాటించారు. ఇది జీర్ణించుకోలేని మనువాది అమిత్ షా ఆయనను అవహేళన చేశారన్నారు. ఖబర్దార్ అమిత్ షా అంటూ హెచ్చరించారు. అంబేద్కర్ను అవమానిస్తే చూస్తూ ఊరుకోమని, ప్రజలను సమీకరించి పోరాడుతామన్నారు. బిజెపికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. సిపిఐ,ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యు, ఏఐటీయూసీ,ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్,జిల్లా నేతలు కళావతమ్మ, రమేష్,కుతుబ్,గోపాలకృష్ణ, ఎత్తం మహేష్,పార్దిపురం రామకృష్ణ ఎత్తం విష్ణు,యూనుస్,రవి, రాంబాబు బన్నీ,యుగంధర్, బాలు,కేశపాగ సందీప్,పవన్ తదితరులు పాల్గొన్నారు.