138 వ మేడే సందర్భంగా కుత్బుల్లాపూర్ ఏఐటీయూసీ నియోజకవర్గ నాయకులతో కలిసి మేడే పోస్టర్ ను షాపూర్ నగర్ కార్యాలయంలో విడుదల చెయ్యడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కులను బీజేపీ అధికారంలోకి వచ్చాక వాటిని తీసివేసి కొత్త చట్టాలు తీసుకువచ్చి కార్మికుల హక్కులను కాలరాసి బడా పెట్టుబడిదారులకు లాభం చేకూరుస్తుందని కావున రాబోవు ఎన్నికల్లో బీజేపీని ఓడగొట్టడానికి మేడే స్పూర్తితో కార్మికులు పనిచేయాలని కోరారు.
పెట్టుబడిదారులకేమో బీజేపీ ప్రభుత్వం టాక్స్ తగ్గించి,ప్రజల పై టాక్స్ పెంచి డబ్బులు వసూళ్లు చేసి పెట్టుబడిదారులకు రుణమాఫీ చేస్తుందని అదే పేద ప్రజలకు ఇచ్చే సబ్సిడీని మాత్రం ఉచితాలు అంటూ తీసివేస్తున్నారని విమర్శించారు. గతంలో 8 గంటల పనిదినాలు ఉంటే బీజేపీ వచ్చాక 12 గంటల పనిదినాలు అయ్యాయని, కార్మికులకు గతంలో ఇచ్చిన పెన్షన్ స్కీం ను తొలగించి కార్మికులకు అన్యాయం చేసే కొత్త పెన్షన్ స్కీం ను తెచ్చారని,ఈ ఎస్ ఐ లో మందులు దొరకట్లేదని, ఉద్యోగులు దాచుకున్న సొమ్మును కూడా ఇవట్లేదని కావున వీటన్నిటిని కార్మికులకు తెలియచేసే విదంగా కార్మిక సంఘాల నాయకులు మేడే ను ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు స్వామి,శ్రీనివాస్, నియోజకవర్గ అధ్యక్షుడు హరినాథ్, ప్రజానాట్యమండలి అధ్యక్షుడు ప్రవీణ్,సీపీఐ బాచూపల్లి కార్యదర్శి శ్రీనివాస్, ఏఐటీయూసీ నాయకులు నగప్ప, దేవేంద్రప్రసాద్, వెంకటేష్, సుంకిరెడ్డి, చంద్రమౌళి,సామెల్,రవి,బాలాజీ,కుమార్,పూర్ణ చందర్ తదితరులు పాల్గొన్నారు.