138 వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా నేడు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శ్రీనివాస్ నగర్, షాపూర్ నగర్,జగతగిరిగుట్ట, ఐడిపిఎల్,గాంధీనగర్,గిరినగర్, అంజయ్య నగర్,మక్డుం నగర్ బీరప్పనగర్, శ్రీరంనాగర్, జీడిమెట్ల,కుత్బుల్లాపూర్ మునిసిపల్ కార్యాలయం, వివిధ కంపెనీల ముందు ఏర్పాటు చేసిన ఎర్రజండా దిమ్మెల వద్ద అరుణపథకాన్ని ఎగురవేసిన అనంతరం షాపూర్ నగర్ ఏఐటీయూసీ కార్యాలయంలో సభను నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యూసఫ్ పాల్గొని మాట్లాడుతూ కనీస పని గంటల కోసం 138 సంవత్సరాల క్రితమే ప్రజలు యాజమాన్యాలకు వ్యతిరేకంగా పోరాడి నలుగురు అశువులు బాస్తే వారి రక్తతర్పణతో ఏర్పడిందే మేడే నని నాటినుండి కార్మికులకు కనీస పనిదినాలు 10 గంటలు తరువాత 8 గంటల పనిదినాలను అమలు జరిగిందన్నారు. అలాంటి గొప్ప చరిత్ర మేడే కి ఉందని కానీ దురదృష్టవశాత్తు నేడు బీజేపీ పార్టీ కార్మికులు పోరాడి సాదించుకొని కార్మికుల హక్కులను కాలరాసి పెట్టుబడిదారులకు ఉపయోగపడేలా కార్మిక చట్టాలను తీసుకువచ్చిందని అన్నారు.బీజేపీ కార్మికుల పక్షాన కాకుండా బడా పరిశ్రమల యాజమాన్యాల కోసం పనిచేస్తుందని విమర్శించారు.
మరో అతిథి ప్రముఖ శాస్త్రవేత్త డా. సోము మర్ల మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రజలు లాభ పడలేదని కరోనా కాలంలో భారత్ బయోటెక్, యశోద,మల్లారెడ్డి లాంటి పరిశ్రమల యాజమాన్యాల లాభాలు వందల రేట్లు పెరిగాయాయని వాటిని చూసి అభివృద్ధి అని చెప్పడం సిగ్గుచేటని అన్నారు.రానున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని కోరారు.
ఈ కార్యక్రమాలకు సీపీఐ కార్యదర్శి ఉమా మహేష్, ఏఐటీయూసీ అధ్యక్షకార్యదర్శి స్వామి,శ్రీనివాస్,నియోజకవర్గ అధ్యక్షుడు హరినాథ్, ఏఐటీయూసీ నాయకులు సాయిలు,చంద్రయ్య,రాజు,కుమార్,నాగప్ప, శేఖర్,సుధాకర్, సామెల్, రవి,మల్లారెడ్డి, సోమయ్య,డేనియల్లు నాయకత్వం వహించారు.
ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్,కార్యదర్శి భాస్కర్,వెంకట్ రెడ్డి,కృష్ణ,సీనియర్ జర్నలిస్ట్ డప్పు రామస్వామి, బాలరాజు లు విప్లవ గేయాలు పాడి కార్యకర్తలను ఉత్తేజపరిచారు.
ఈ కార్యక్రమంలో సదానంద్,మాజీ కౌన్సిలర్ నర్సయ్య, వీరస్వామి, నర్సింహ,ఆశయ్య,యాదయ్య,యాకుబ్,ఖయుమ్,ఖాదీర్, కనకయ్య, మహేందర్,చారీ, చంద్రమౌళి,కృష్ణ,శ్రీనివాస్,సుంకిరెడ్డి,దేవేంద్రప్రసాద్, వెంకటేష్,కమలమ్మ,మహిళ సమాఖ్య నాయకురాలు హైమవతి, చంద్రమ్మ,వందలాది మంది కార్మికులు పాల్గొన్నారు.