STUDENT విద్యార్థులను చైతన్యం చేయడానికి ఏఐఎస్ఎఫ్ ముందుండాలి
సమస్యల పరిష్కారం కోసం ఏఐఎస్ఎఫ్ గా ప్రశ్నిస్తూనే ఉండాలి
మంద పవన్,ఏఐఎస్ఎఫ్ జిల్లా నిర్మాణ బాధ్యులు,సిద్దిపేట
సాక్షిత సిద్దిపేట జిల్లా :
సిద్దిపేట జిల్లా సమాజంలో విద్యార్థులను చైతన్యం చేయడానికి అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్)గా ముందుండాలని సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ప్రశ్నించే విధంగా విద్యార్థులను తయారు చేయాలని ఏఐఎస్ఎఫ్ సిద్దిపేట జిల్లా నిర్మాణ బాధ్యులు,మాజీ రాష్ట్ర నాయకులు మంద పవన్ అన్నారు..
రోజున సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎడ్ల గురువారెడ్డి భవన్ లో ఏఐఎస్ఎఫ్ సిద్దిపేట జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు..
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ సమరశీల ఉద్యమాల రథసారథి ఏఐఎస్ఎఫ్ అని,ప్రస్తుత ఏఐఎస్ఎఫ్ నాయకత్వం చదువుతూ పోరాడు చదువుకై పోరాడు అనే నినాదంతో ముందుకు సాగాలని,సమస్యలపై ఉద్యమాలు చేస్తూనే సమాజంలో విద్యార్థులను చైతన్యం చేయాలని ఆయన ఏఐఎస్ఎఫ్ నాయకులు ఉద్దేశించి అన్నారు..ప్రస్తుత సమాజంలో విద్యార్థులు రోజురోజుకీ చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారని, మత్తు పానీయాలకు, డ్రగ్స్ కు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని సక్రమంగా నడిపించడానికి, విద్యార్థులను చైతన్యం చేయడానికి శాస్త్రీయ ఆలోచనల వైపు మళ్ళించడానికి, సమాజంలో జరిగే అవినీతి అక్రమాలపై ప్రశ్నించేలా చేయడానికి ఏఐఎస్ఎఫ్ నాయకులుగా ముందు వరసలో ఉండాలని సమాజం పట్ల బాధ్యతయుతంగా ఉండాలని ఆయన అన్నారు..అదేవిధంగా ప్రభుత్వాలు అవలంబించే విద్యార్థి వ్యతిరేక విధానాలను విద్యార్థి లోకానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఏఐఎస్ఎఫ్ యొక్క సభ్యత్వాన్ని పెంచుతూ సంఘ నిర్మాణం కోసం,బలోపేతం కోసం నిరంతరం శ్రమించాలని అన్నారు.. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సంగెం మధు, జేరిపోతుల జనార్ధన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రామగల్ల నరేష్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ చిట్యాల శేఖర్, జిల్లా సహాయ కార్యదర్శి వేల్పుల ప్రసన్నకుమార్ లు ఉన్నారు