SAKSHITHA NEWS

ఎస్సీ వర్గీకరణ త్వరితగతిన చేపట్టాలని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిపాదాస్ మున్షీ కి వినతి పత్రం అందించిన కాంగ్రెస్ నేత మాజీ మంత్రి వర్యులు డాక్టర్ ఏ చంద్రశేఖర్

హైదరాబాద్: రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి శ్రీ దిపాదాస్ మున్షీ గారిని ఇవాళ హైదరాబాద్ కార్యాలయం లో మర్యాద పూర్వకంగా కలిసిన మాజీ మంత్రి డాక్టర్ ఏ చంద్రశేఖర్ ఈ సందర్భంగా రాష్ట్రం లో స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందుగానే ఎస్సీ వర్గీకరణ చేయాలని విజ్ఞప్తి చేశారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నియమించే కార్పోరేషన్ల చైర్మన్ పదవులను మాదిగలకు కేటాయించాలని కోరారు మరియు కాంగ్రెస్ పార్టీ సంస్థగత నియామకాల్లో మాదిగలకు ప్రాదాన్యత కల్పించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు ఈ అంశంపై ఆమె సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సతీష్ మాదిగ , గజ్జెల కాంతం తదితరులు ఉన్నారు.


SAKSHITHA NEWS