SAKSHITHA NEWS

చంద్రయాన్‌-3 విజయవంతం కావడంతో భారతదేశం త్వరలో సముద్రయాన్‌ను చేపట్టనుంది…

సముద్రయాన్‌ మిషన్‌ పేరుతో సముద్రం అడుగు భాగానికి యాత్రను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది…

సముద్రపు లోతులను అన్వేషించే మానవసహిత సబ్ మెర్సిబుల్ మత్స్య 6000 నౌకను చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అభివృద్ధి చేస్తోంది…
ఇది దేశంలోనే మొట్టమొదటి మానవసహిత సముద్ర అన్వేషణ మిషన్…

ఆక్వానాట్‌లను సముద్రంలో 6,000 మీటర్ల లోతుకు తీసుకెళ్లేందుకు గోళాకార సబ్ మెరైన్ ను నిర్మిస్తున్నారు. దీని ద్వారా సముద్ర వనరులు, జీవ వైవిధ్యంపై అధ్యయనం జరపవచ్చు. సముద్ర అడుగు భాగంలోకి కోబాల్డ్, నికెల్, మాంగనీస్ వంటి విలువైన లోహాలు, ఖనిజాల గురించి అన్వేషించనుంది…

ఇప్పటి వరకూ అమెరికా, రష్యా, జపాన్, ఫ్రాన్స్, చైనా మాత్రమే మానవసహిత సబ్‌లను అభివృద్ధి చేశాయి.

మత్య్స 6000 పూర్తయితే..ఈ జాబితాలో భారత్ కూడా చేరనుంది.


SAKSHITHA NEWS