కొంపల్లి మున్సిపాలిటీ పరిధి ఎన్సీఎల్ పార్క్, ప్రజయ్ అపార్ట్మెంట్స్, ఉమామహేశ్వర కాలనీ, వెన్ సాయి, శ్వేతా శుభం, జయభేరి, శ్రీనివాస్ నగర్ కాలనీ, కొంపల్లి విలేజ్, సెంట్రల్ పార్క్, దూలపల్లి ఎస్సీ కాలనీ, దూలపల్లి విలేజ్, ఎన్టీఆర్ స్టాచు, 120 గజాలు కాలనీ, 60 గజాలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శివారు మున్సిపాలిటీలో వేగవంతంగా అభివృద్ధి చెందాయన్నారు. మన ప్రాంతం – మన అభివృద్దితో మున్సిపాలిటీలలోని అన్ని కాలనీలు, బస్తీలలో మౌలిక వసతులైన సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మంజీరా నీటి సరఫరా, పార్కుల నిర్మాణం వంటి పనులు చేపట్టామని రానున్న రోజుల్లో కాలనీలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామన్నారు. అభివృద్ధిని కొనసాగించేందుకు – సంక్షేమ పథకాలు అందించేందుకు నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో మూడవ నెంబర్ పై ఓటు వేసి ముచ్చటగా మూడవసారి భారీ మెజార్టీతో హ్యాట్రిక్ విజయం అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్, బిఆర్ఎస్ కొంపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు, వైస్ చైర్మన్, ఎన్నికల ఇంచార్జ్, వార్డు సభ్యులు, వార్డ్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, సంక్షేమ సంఘం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.