జగిత్యాల జిల్లా…
బాధిత మహిళలకు,చిన్న పిల్లలకు భరోసా సెంటర్ ద్వారా సత్వర సేవలు అందించాలి.
భరోసా కేంద్రాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ .
ఈ రోజున పట్టణ కేద్రంలోని భరోసా సెంటర్ ని సందర్శించి లైంగిక, భౌతిక దాడులకు గురైన బాధితులకు భరోసా సెంటర్ లో కల్పించే న్యాయ సలహాలు,సైకలాజికల్ కౌన్సెలింగ్, వైద్య పరంగా తీసుకుంటున్న చర్యలు,మహిళల వేధింపులపై నమోదు అవుతున్న కేసుల వివరాలు తదితర విషయాలు అడిగి తెలుసుకొని,భరోసా సెంటర్ అందిస్తున్న సేవలు,పరిసరాలను ఎస్పీ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…పోలీస్ శాఖ మహిళల రక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని మహిళలకు ఎలాంటి ఆపద వచ్చిన వెంటనే స్పందిస్తూ పోలీస్ శాఖ రక్షణ కల్పిస్తుందని అన్నారు. మహిళలను, చిన్నపిల్లలను వేధిస్తే చర్యలు తప్పవు అన్నారు.లైంగిక దాడులకు గురైన బాధితులకు సత్వర సేవలు అందించాల్సిన బాధ్యత భరోసా కేంద్రం పై ఉందని,లైంగిక దాడులకు గురైన బాధితులకు భరోసా కల్పిండంతో పాటు వారికి పూర్తి సహయ సహకారాలను అందించాలని, జిల్లాలో ఎక్కడైనా పోక్సో మరియు అత్యాచారం కేసులు జరగగానే సంబంధిత బాధితులను నేరుగా భరోసా సెంటర్ కు సంబంధిత అధికారులు తీసుకొని రాగానే చట్ట ప్రకారం వారికి అందించవలసిన సూచనలు సలహాలు తక్షణమే అందించాలని భరోసా సిబ్బందికి సూచించారు.పోక్సో మరియు అత్యాచార కేసుల్లో బాధితులకు త్వరగా కాంపెన్సేషన్ ఇప్పించడానికి వివిధ డిపార్ట్మెంట్ అధికారులు సిబ్బంది కృషి చేయాలని తెలిపారు.భరోసా సెంటర్ సేవల గురించి జిల్లాలో విద్యార్థులకు, మహిళలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించలని భరోసా సెంటర్ సిబ్బందికి సూచించారు.
ఎస్పీ గారి వెంట సీసీ రంజిత్ రెడ్డి, భరోసా సిబ్బంది ఉన్నారు.