SAKSHITHA NEWS

టేకుమట్ల ఎన్.డి.సి.ఎం.ఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో తేమ శాతం పరిశీలించిన ఏఈఓ స్వాతి.

సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి : కొనుగోలు కేంద్రాలలో ధాన్యం పోసిన రైతులు ప్రభుత్వం నిర్ణయించిన తేమశాతం వచ్చేంతవరకు ధాన్యాన్ని కచ్చితంగా ఆరబెట్టుకోవాలని ఏఈఓ స్వాతి అన్నారు. సూర్యాపేట మండల పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తేమశాతాన్ని పరిశీలించి మాట్లాడారు. దాన్యాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని మట్టి పెళ్ళలు,రాళ్లు, లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. లేని పక్షాన మిల్లుల వద్దకు వెళ్ళిన తర్వాత రైతులు ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన తేమశాతం వచ్చేంతవరకు ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని నిర్వాహకులకు తెలిపారు. ఎన్ డి సి ఎం ఎస్ ఇన్చార్జి దాసరి శ్రీను, టాబ్ ఆపరేటర్ కత్తుల రాజేష్, బుక్ కీపర్ దాసరి రమేష్ రైతులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS