SAKSHITHA NEWS

ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోరుతూ ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అసెంబ్లీ మరియు మండలికి ఆటోల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కలిసి బయలుదేరిన మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మరియు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు…

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో 8 లక్షల మంది ఆటో డ్రైవర్లకు ఎన్నో హామీలు ఇచ్చింది. ఆ హామీలు ఏవి అమలు కాలేదు. ఇప్పటివరకు 90 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

గత అసెంబ్లీ సమావేశాల్లోనే ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల జాబితాను అందించాం.

ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి ఇస్తామన్న పన్నెండు వేల రూపాయలను వెంటనే ఇవ్వాలి. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు, వెంటనే ఏర్పాటు చేయాలి.

ఆటో డ్రైవర్లు ఎవరో ఆత్మహత్యలకు పాల్పడవద్దు. మీ పక్షాన వారి కోసం పోరాడుతాం. ఆటో డ్రైవర్లకు సంఘీభావంగా మేము ఆటోలో అసెంబ్లీకి వెళ్తున్నాం. వారి యూనిఫాంలో ధరించి వచ్చాము. – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్


SAKSHITHA NEWS