Activists in the presence of Chandrababu in the meeting held at The Maurya Inn in Kurnool
కర్నూల్ లోని ది మౌర్య ఇన్ లో జరిగిన సమావేశంలో చంద్రబాబు సమక్షంలో కార్యకర్తల
సంక్షేమంపై మాట్లాడుతున్న టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్
కర్నూల్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షలో చంద్రబాబుతో కలిసి వేదికపై కూర్చున్న శిష్ట్లా లోహిత్
కార్యకర్తల క్షేమం, సంక్షేమం తెలుగుదేశం పార్టీ బాధ్యత
న్యూట్రిఫుల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోండి
చంద్రబాబు సమక్షంలో మాట్లాడిన శిష్ట్లా లోహిత్
కర్నూల్ సభలో కార్యకర్తల సంక్షేమంపై అవగాహన
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల క్షేమం, సంక్షేమం తెలుగుదేశం పార్టీ బాధ్యత అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమ నిధి కోఆర్డినేటర్ శిష్టా లోహిత్ చెప్పారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చేపట్టిన కర్నూల్ జిల్లా పర్యటనలో భాగంగా మూడవ రోజు శుక్రవారం ఐటీ ప్రెజెంటేషన్ కార్యక్రమాలను నిర్వహించారు.
దీనిలో భాగంగా కర్నూల్ లోని ది మౌర్య ఇన్ లో జరిగిన సమావేశంలో చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమంపై శిష్ట్లా లోహిత్ మాట్లాడారు. పార్టీ కోసం ప్రాణాలిచ్చే కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ సొంతమని అన్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం దేశంలో మొదటగా ఆలోచన చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు.
సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు రూ. 2 లక్షల ప్రమాద బీమాను అందించడం జరుగుతోందన్నారు. కార్యకర్తల పూర్తి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని న్యూట్రిఫుల్ యాప్ ను ఎన్టీఆర్ ట్రస్ట్ రూపొందించిందన్నారు. ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకునే విధానంపై అవగాహన కల్పించారు. టీడీపీ కార్యకర్తలు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి ఈ యాప్ దోహదపడుతుందన్నారు.
కార్యకర్తలు ఫిట్ గా ఉండడానికి అవసరమైన సలహాలు, సూచనలను కూడా ఇస్తున్నామన్నారు. ఆహారం, వ్యాయామం, నిద్ర తదితర విషయాలపై ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తున్నామన్నారు. అలాగే కార్యకర్తల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కార్కినోస్ హెల్త్ కేర్ ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఈ కార్కినోస్ ద్వారా అనారోగ్యానికి సంబంధించి ముందస్తు సంకేతాలపై అవగాహన కల్పిస్తామన్నారు.
ఖచ్చితమైన రోగ నిర్ధారణ చేసి చికిత్సను అందించడం జరుగుతుందన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పిల్లల చదువులు ఆగిపోకుండా వారిని చదివిస్తున్నామన్నారు. అనారోగ్యానికి గురైన వారికి ఆర్థికసాయం అందిస్తున్నామన్నారు. కార్యకర్తల పిల్లలకు స్వయం ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తున్నామన్నారు. అంతర్జాతీయ స్థాయిలోనూ ఉద్యోగాల కల్పన జరుగుతోందన్నారు. చంద్రబాబు, నారా లోకేష్ ఆదేశాల మేరకు కార్యకర్తల సంక్షేమానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని శిష్ట్లా లోహిత్ హామీ ఇచ్చారు.