SAKSHITHA NEWS

బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డిని క‌లిసిన తైక్వాండో జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జి.శోభ‌న్‌బాబు…!


సాక్షితశ్రీశైలం నియోజకవర్గం ; గుర్తింపు లేని తైక్వాండో స‌మాఖ్య‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తైక్వాండో జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి . జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు
జి. శోభ‌న్‌బాబు కోరారు. శాప్ చైర్మ‌న్ బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డిని శోభన్‌బాబు క‌లిసి ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. ప్ర‌భుత్వం క్రీడ‌ల అభివృద్ధికి చేప‌డుతున్న చ‌ర్య‌ల‌ను అభినందిస్తూ క్రీడాకారుల‌ను ప్రోత్స‌హించాల‌ని కోరారు. అనంత‌రం శోభ‌న్‌బాబు మాట్లాడుతూ.. విద్యార్థులు ఎల్లవేళలా చదువుతోనే కాకుండా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ప‌రిధిలోని టైక్వాండో క్రీడ ఎంచుకోవాల‌న్నారు. తైక్వాండోతో ఆత్మ‌ర‌క్ష‌ణ క‌లుగుతుంద‌న్నారు. పిల్లలు శ్రద్ధగా, క్రమశిక్షణతో ఎదిగేందుకు దోహ‌ద‌ప‌డుతుంద‌న్నారు. క్రీడ‌ల పట్ల ఆసక్తి చూపుతార‌న్నారు. జిల్లాలో గుర్తింపు లేని స‌మాఖ్య‌లు పుట్టుకొస్తున్నాయ‌ని, వాటి వ‌ల్ల విద్యార్థులు న‌ష్ట‌పోయే అవ‌కాశం ఉంద‌న్నారు. న‌కిలీ స‌మాఖ్య‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని సిద్ధార్థ‌రెడ్డిని కోరిన‌ట్లు శోభ‌న్‌బాబు తెలిపారు.


SAKSHITHA NEWS