SAKSHITHA NEWS

ACP Venkat Reddy started CCTV cameras in Vinavanka mandal of Karimnagar district

కరీంనగర్ జిల్లా వినవంక మండలంలోని సీసీ కెమెరాలను ప్రారంభించిన ఏసిపి వెంకట్ రెడ్డి

వీణవంక మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన గూడ వజ్రమ్మ పాపయ్యల కుమారుడు గూడ రాజయ్య తల్లిదండ్రుల జ్ఞాపకార్థం గా తన వంతుగా గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు చేశారు. కావున ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏసీబీ వెంకట్ రెడ్డి చేతుల మీదుగా సీసీ కెమెరాలను ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ఒక కెమెరా 100 పోలీసులతో సమానమని గ్రామాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నేరాలను అరికట్టవచ్చని అన్నారు.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ డివిజన్ ఏసిపి కె వెంకట్ రెడ్డి సిఐ సురేష్, ఎస్ ఐ కె శేఖర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ బండారీ ముత్తయ్య, మహిపాల్ రెడ్డి, సత్యనారాయణ, శంకర్ రెడ్డి, వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.