SAKSHITHA NEWS

యువకుడిని హత్య కేసులో నిందితులు అరెస్ట్

— కేసును ఛేదించిన పోలీసులని అభినందించిన యస్.పి అపూర్వ రావు

నల్లగొండ (సాక్షిత ప్రతినిధి)

నవీన్ అనే యువకుడిని హత్య చేసిన కేసులో 9 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో యస్.పి అపూర్వ రావు కేసు వివరాలను వెల్లడిస్తూ మృతుడు ఇరిగి నవీన్ గత నాలుగు సంవత్సరాల నుండి వారి గ్రామానికి చెందిన మైనర్ అమ్మాయిని ప్రేమిస్తు తన వెంట పడుతూ వేధింపులకు గురి చేస్తుండగా ఇట్టి విషయం తెలిసి అమ్మాయి వరుసకు తమ్ముడు అయిన మణిదీప్ మృతుడు నవీన్ ను మందలించడం జరిగింది. తరువాత సదరు అమ్మాయి కూడా మృతుడిని తన వెంట పడవద్దు అని తనను మరిచిపోమని చెప్పడం జరిగింది. గత నెల రోజుల క్రితం నవీన్ మనస్థాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించడం జరిగింది. తరువాత మృతుడు మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకొని ఆరోగ్యం కుదుట కుదుటపడిన తర్వాత కూడా మరల సదరు అమ్మాయి ఇంటి చుట్టూ తిరుగుతుండగా అమ్మాయి తమ్ముడు మణిదీప్ మరియు అతని స్నేహితుడు శివప్రసాద్ కలిసి మృతుడిని అమ్మాయి చుట్టూ తిరిగితే చంపుతామని బెదిరించడం జరిగింది. ఎలాగైనా నవీన్ ని చంపాలని పథకం ప్రకారం నవీన్ అతని మిత్రుడు అనిల్ లను అందరూ కలిసి చుట్టుముట్టి కర్రలతో దాడి చేయగా అనిల్ కు దెబ్బలు తగిలినవి, వెంటనే నవీన్ వారి నుండి తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నించగా నేరస్తులందరూ అతనిని వెంటాడి కర్రలతో కొట్టినారు, రామలింగం తన వెంట తెచ్చుకున్న కత్తితో మృతుడు నవీన్ ను 11 సార్లు పొడవగా అనిల్ అక్కడికక్కడే చనిపోయినాడు. నేరస్థులందరు గుంటూరుకు పారిపోయి ఆ రోజు నుండి అక్కడే తలదాచుకున్నారు. వారి వద్ద ఉన్న డబ్బులు అయిపోవడంతో డబ్బుల కోసం మరియు దుస్తుల కోసం ఇంటికి రాగా నిడమనూరు ఎస్.సి మరియు త్రిపురారం ఎస్ఐ సిబ్బందితో కలిసి నేరస్థులను పట్టుకొని మిర్యాలగూడ డిఎస్పీ వెంకటగిరి ముందు హాజరుపర్చారు. డిఎస్పీ నిందితులను విచారించగా వారు చేసిన నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. తొమ్మిది మంది నేరస్థులలో ఇద్దరు బాల నేరస్థులు ఉన్నారని వీరిని రిమాండ్ నిమిత్తం కోర్టు ముందు హాజరు పరచడం జరుగుతుందని తెలిపారు. ఈ కేసును జిల్లా ఎస్పీ అపూర్వరావు పర్యవేక్షణలో, మిర్యాలగూడ డిఎస్పీ పి. వెంకటగిరి, హాలియా సీఐ గాంధీ నాయక్, నిడమనూరు ఎస్.ఐ ఎం.శోభన్ బాబు, త్రిపురారం ఎస్సై జి.శోభన్ బాబు లు వారి సిబ్బందితో కలిసి ఛేదించడం జరిగింది. కేసును తొందరగా చేదించినందుకుగాను జిల్లా యస్.పి అభినందనలు తెలిపారు .


SAKSHITHA NEWS