నేరడలో ఆటల ప్రాంగణానికి హామీ ఇచ్చిన స్థానిక ఎమ్మెల్యే సీఎల్పీ నేత బట్టి
సాక్షిత :
చింతకాని మండలం నేరడ గ్రామంలో మహాశివరాత్రి జాతర సందర్భంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలు స్థానిక ఎమ్మెల్యే శాసనసభ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించి ఆయన మాట్లాడుతూ ఈ గ్రామంలో గత 42 సంవత్సరాల నుంచి ఈ నేతాజీ యువజన సంఘం క్రీడలు నిర్వహించడం చాలా అర్థగా భావించాలి ఎందుకంటే కొన్ని గ్రామాలలో ఒకటి రెండు సంవత్సరాలు పెట్టిన తర్వాత ఆటలను ఎలా వదిలేస్తూ ఉంటారు కానీ ఈ గ్రామంలో సంఘం వారు ప్రతి సంవత్సరం నిర్వహించడం అంటే కూడా ఖర్చుతో కూడుకున్న కార్యక్రమం దాంతో పాటు ప్రతి ఒక్కరిని సముదాయిస్తూ అందరిని కలుపుకుంటూ పోతూ కార్యక్రమాన్ని ఎంత గొప్పగా విజయవంతంగా చేస్తున్నారంటే సంఘాన్ని నేను అభినందిస్తూ సంఘం వారు ఒక కోరిక కోరారు ఆటల స్థలం లేక ప్రతి సంవత్సరం అనేక ఇబ్బందులు పడుతున్నారని నా దృష్టికి తీసుకొచ్చారు నేను ఈ నియోజకవర్గానికి స్థానిక ఎమ్మెల్యేగా నా ద్వారా ప్రభుత్వం పై మాట్లాడి దానికి అవసరమైన ఆటల ప్రాంగణాన్ని సమకూర్చే బాధ్యత తీసుకుంటూ 2024లో నూతనంగా ఆటస్థలం ఏర్పాటు చేసుకొని ఘనంగా నిర్వహించుకోవాలని హామీ ఇస్తున్నానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సబాధ్యక్షులు నేతాజీ యువజన సంఘం వ్యవస్థాపకులు దూసరి శ్రీరాములు అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని విక్రమార్క డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు పులిపాటి వెంకయ్య దూసరి నేతాజీ గ్రామ సర్పంచ్ గొర్రెముచ్చు ఈశ్వరమ్మ గ్రామ ఉప సర్పంచ్ దూసరి గోపాలరావు పెరిక ప్రభాకర్ షేక్ దస్తగిరి మట్ట రవి గోగుల ఆది కాట్రాల మహేష్ బండి వెంకటేశ్వర్లు బండి విజయ తదితరులు పాల్గొన్నారు.