లాజిక్ ప్రకారం… ముందు సీఎం రేవంత్ రెడ్డిని అరెస్టు చేయాలి: మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్:
హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడంపై బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించి, విమర్శలు గుప్పించారు.
జాతీయ అవార్డు విజేత అల్లు అర్జున్ అరెస్ట్ పాల కుల అభద్రతకు పరాకాష్ట అని చెప్పారు. తొక్కిసలాట బాధితుల పట్ల తనకు పూర్తిగా సానుభూతి ఉందని… కానీ ఆ ఘటనలో వాస్తవంగా విఫలమయిం ది, ఎవరని ప్రశ్నించారు.
అల్లు అర్జున్ కు నేరుగా ఎలాంటి సంబంధం లేని కేసులో… ఆయనను ఒక సాధారణ నేరస్తుడిగా చూడటం సరికాదని అన్నా రు. గౌరవం, గౌరవప్రదమైన ప్రవర్తనకు ఎప్పుడూ స్థానం ఉంటుందని కేటీఆర్ చెప్పారు.
ప్రభుత్వం వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తు న్నానని చెప్పారు. ఇదే లాజిక్ తో వెళ్తే… హైడ్రా సృష్టించిన భయాందోళనల కారణంగా హైదరాబాద్ లో ఇద్దరు అమాయకులు చనిపోయారని… దీనికి కారణమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలని, మాజీ మంత్రి కేటీఆర్ పిట్ట గూట్లో రాసుకొచ్చారు.