SAKSHITHA NEWS
ACB raids at ACP's house

హైదరాబాద్‌లో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్ రావు ఇంట్లో ఏసీబీ సోదాలు చేపట్టింది.

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ అశోక్ నగర్‌లోని ఇంటితో పాటు ఏకకాలంలో 6 చోట్ల ఏసీబీ సోదాలు చేపట్టింది.

సాహితి ఇన్ ఫ్రా కేసులో విచారణ అధికారిగా ఉమామహేశ్వరరావు ఉన్నారు. ఈ ఏసీబీ సోదాలకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.