దోపిడీకి గురైన రెండు కోట్ల మూడు లక్షల విలువైన(సుమారు 3.5 కేజీల) బంగారు నగలు, 5 లక్షల రూపాయల నగదు రికవరీ.
15 లక్షల విలువైన రెండు కార్లు స్వాధీనం.
9 మంది ముద్దాయిలు అరెస్టు.
...తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఐ.పీ.ఎస్., .
ది.21.02.2024 సాయంత్రం సుమారు 06.00 గం. లకు జంగారెడ్డిగూడెం నుండి భీమవరం కారులో వెళుతున్న బంగారు నగల వ్యాపారి శ్రీ బాలు నాథూరాం గారి కారును తమ ఇన్నోవా కారుతో అడ్డగించిన 5 మంది ముద్దాయిలు, వారిని మరియు వారి డ్రైవరు ను బెదిరించి, తమ కారులో ఎక్కించుకుని, బంగారు నగలతో వున్న వారి కారును వారిలో వొక ముద్దాయి నడుపు చుండగా, మరొక బ్రేజా కారులో మిగిలిన ముద్దాయిలు వెంటరాగా, వారిని రాజమహేంద్రవరం 4 వ వంతెన వద్ద జీరో పాయింట్ వద్ద వారి కారులోని బంగారు నగలు సుమారు 3.5 కేజిలు మరియు నగదు సుమారు 5 లక్షలు దొంగిలించి, వారిద్దరినీ, వారి కారును అక్కడ వదిలి పారిపోయినారు.
దీనిపై శ్రీ బాలు నాథూరాం గారు యిచ్చిన రిపోర్ట్ పై నల్లజర్ల పోలీస్ స్టేషన్ లో డెకాయిటీ కేసు నమోదు చేయడమైనది. ఈ కేసులో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పి. జగదీష్, ఐ.పీ.ఎస్., మొత్తం 4 స్పెషల్ టీం లను ఏర్పాటు చేసి, టెక్నికల్ సాక్ష్యాలను, పాత నేరస్థుల కదలికలను పరిశీలించుచుండగా, రాజమహేంద్రవరం నుండి కొంతమంది అనుమానాస్పదమైన వ్యక్తులు వొక ఇన్నోవా క్రిష్ట కారు లోనూ, స్విఫ్ట్ డిజైర్ కారు లోనూ విజయవాడ వైపు వస్తున్నారని తెలిసి, పై కేసులో దర్యాప్తులో వున్న ఈ దిగువ పేర్కొన్న అధికారులు మరియు సిబ్బందిని నేరస్తులను పట్టుకొని విచారించుటకు నియమించగా, వారు ఈ రోజు ఉదయం సుమారు 09.30 గం.లకు ఈ దిగువ పేర్కొన్న 9 మందిని అరెస్ట్ చేసి, వారి వద్దనుండి మొత్తం 188 బంగారు గొలుసులు, కరిగించిన బంగారం ముద్దలు మొత్తం సుమారు 3.5కేజిల బంగారు నగలు స్వాదీనం చేసుకోవడమైనది.
కొవ్వూరు SDPO గారైన కే. సిహెచ్. రామారావు మరియు రాజమహేంద్రవరం నార్త్ జోన్ డి.ఎస్.పి కే. శ్రీనివాసులు , డి.ఎస్.పి (క్రైమ్స్) కె. శ్రీనివాసమూర్తి ఆద్వర్యంలో, నల్లజర్ల ఇన్స్పెక్టర్ K.దుర్గా ప్రసాద్ , రాజమహేంద్రవరం CCS ఇన్స్పెక్టర్ లు శ్రీ K.రజనీ కుమార్ , K. విజయబాబు , ఉమామహేశ్వర రావు , దేవరపల్లి SI, K. శ్రీహరి మరియు సిబ్బంది సహాయంతో కేసును దర్యాప్తు చేసి, ముద్దాయిలను అరెస్ట్ చేసినారు.
ముద్దాయిల యొక్క వివరములు
1) చలపాక వెంకటేష్ , తండ్రి:భాస్కర రావు, 35 సం. విశ్వబ్రాహ్మణ , సుబ్బమ్మపేట, జంగారెడ్డిగూడెం.
2) మద్దిపాటి కళ్యాణ్, తండ్రి: రాజా రావు, 28 సం. కాపు, వాటర్ ప్లాంట్ నిర్వహణ, త్రివేణి కాలేజీ జంక్షన్, జంగారెడ్డిగూడెం.
3) కోడూరి రవితేజ, @ రవి, తండ్రి: మోహన రావు, 25 సం., కాపు, ఉల్లిపాయాల వ్యాపారం, పద్మశ్రీ థియేటర్ వద్ద, బుట్టాయిగూడెం రోడ్డు, జంగారెడ్డిగూడెం.
4) కోనా శ్రీనివాస్, @ నాని, తండ్రి: శ్రీను, 28 సం. కాపు, కార్ డ్రైవరు, YSR కాలనీ, జంగారెడ్డిగూడెం.
5) వేముల మంజుబాబు, తండ్రి: దుర్గా రావు, 22 సం. కాపు, రామలకుంట చెరువు, జంగారెడ్డిగూడెం.
6) షేక్ నాగూర్ మీరావల్లి, తండ్రి: మస్తాన్ వల్లి, 22 సం. ముస్లిం, కార్ డ్రైవరు, నాగ దేవత గుడి వెనుక, మార్కెట్ యార్డ్ వద్ద, జంగారెడ్డిగూడెం.
7) వేముల మోహన్ సాయి, @ సాయి, తండ్రి: దుర్గా రావు, 24సం. కాపు, కోర్టు వద్ద, ఆటో నగర్, జంగారెడ్డిగూడెం.
8) మోహన్ నారాయణ్ కుంబాకర్, తండ్రి: నారాయణ, కుంబాలు కులం, మునసుబు గారి వీధి, అశ్వారావుపేట రోడ్డు, బంగారు నగల తయారీ పని, జంగారెడ్డిగూడెం.
9) పమిడిపల్లి బ్రహ్మాజీ, తండ్రి: శ్రీనివాస రావు, 36 సం. విశ్వబ్రహ్మణ, బంగారునగల తయారీ, మునసుబు గారి వీధి, అశ్వారావుపేట రోడ్డు, జంగారెడ్డిగూడెం.
పై కేసును అతి తక్కువ సమయంలో చేదించి, ముద్దాయిలను అరెస్టు చేసి, వారి వద్ద నుండి చోరీ సొత్తును రికవరీ చేసిన అధికారులను మరియు సిబ్బంది జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి, అప్రిసియేషన్ సర్టిఫికెట్లు మరియు క్యాష్ రివార్డ్లు అందజేసినారు.