చింతకానిమండల పరిధిలోని ప్రత్యేక అవసరాలు గల (0-18) 18 సంవత్సరాల లోపు వయసు కలిగిన శారీరక దివ్యాంగ చిన్నారులకు, పుట్టుకతో శరీర వైకల్యం గల చిన్నారులకు, పాక్షిక పక్షవాత సమస్య వలన కూర్చోవడంలోను, నడవడంలోనూ నిలబడడంలోనూ, శరీరంలోని కండరాల మధ్య సరియైన సమన్వయo
లేకపోవడం వల్ల, తన పనులు తాను చేసుకోవడంలో ఇబ్బంది పడే చిన్నారులకు, మండల విద్యాశాఖ అధికారి మోదుగు శాంసన్ పర్యవేక్షణలో ఉచితంగా, తెలంగాణ రాష్ట్ర సమగ్ర శిక్ష అభియాన్ వారి సహాయ సహకారంతో బుధవారం నాడు లచ్చగూడెం గ్రామంలోని హై స్కూల్ ప్రాంగణం లోని దివ్యాంగ బాలబాలికలభవిత కేంద్రంలో నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో ప్రత్యేక అవసరాలు గల బాల బాలికలు వారి తల్లిదండ్రులతో హాజరయ్యారు, ఈ కార్యక్రమంలో ఫిజియోథెరపీ వైద్యురాలు డాక్టర్ జీ .వసంత, మండల దివ్యాంగ చిన్నారుల సమన్వయకర్తలు, కవికొండల శ్రీనివాస్ కృష్ణారావు, ఐ ఈ ఆర్ పి, భూక్యాదస్లి , కేర్ గివర్, ఏ, లలిత కుమారి, అంగన్వాడి ఆయా లచ్చమ్మ పాల్గొన్నారు, ముగ్గురు చిన్నారులను సికింద్రాబాద్ జాతీయ మానసిక వికలాంగుల సంస్థకు పంపించడం జరిగింది. చిన్నారి దివ్యాంగ బాల బాలికలకు ప్రభుత్వం ద్వారా లభించే అన్ని పథకాల గురించి మరింత సమాచారం కొరకు ఈ క్రింది వారిని సంప్రదించగలరు కేఎస్ కృష్ణారావు:- 6302504078, బీ.దస్లి:-9701611706& డాక్టర్ జీ వసంత:-9618608929.
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app
SAKSHITHA NEWS
DOWNLOAD APP