shock to YCP in Rajolu, Bonthu Rajeswara Rao joins Janasena
రాజోలులో వైసీపీకి షాక్, జనసేనలోకి బొంతు రాజేశ్వరరావు.
రాజోలులో వైసీపీ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత బొంతు రాజేశ్వరరావు వైసీపీకి రాజీనామా చేశారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో అధికార పార్టీ వైసీపీకి గట్టి షాక్ తగిలింది. రాజోలులో కీలక నేత బొంతు రాజేశ్వరరావు వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రెండుసార్లు రాజోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు బొంతు. కొద్దిరోజుల క్రితం ప్రభుత్వ సలహాదారు పదవికీ బొంతు రాజీనామా చేశారు. తాజాగా పార్టీకి రాజీనామా చేసి సీఎం జగన్ కు తన రాజీనామా చేశారు.
ఆ లేఖను మీడియాకు బొంతు విడుదల చేశారు. రాజోలు నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలపైనే దాడులు జరుగుతున్నాయన్నారు. ఈ పరిస్థితి చూడలేకే వైసీపీ రాజీనామా చేశానని బొంతు రాజేశ్వరరావు వెల్లడించారు. జనసేన నుంచి గెలిచిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు వైసీపీలో ప్రాధాన్యం ఇవ్వడంపై బొంతు వర్గం ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం.
త్వరలోనే జనసేన పార్టీలో చేరుతున్నట్లు బొంతు రాజేశ్వరరావు ప్రకటించారు. ఉమ్మడి ఏపీలో ఇరిగేషన్ ఇంజినీర్ ఇన్ ఛీఫ్ గా పనిచేసిన బొంతు రాజేశ్వరరావు వై.ఎస్.కు సన్నిహితుడిగా ఉన్నారు.