A rare surgery at Navina Hospital in Khammam
ఖమ్మంలో నవీన హాస్పిటల్ లో అరుదైన శస్త్రచికిత్స
సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్
ఖమ్మం నగరంలో బాలాజీ నగర్ లో గల నవీన హాస్పటల్లో అరుదైన శస్త్ర చికిత్స జరిగింది అని డాక్టర్ ప్రణయ్ జనరల్ సర్జన్ అన్నారు.
డాక్టర్ ప్రణయ్ తెలిపిన వివరాల ప్రకారం తల్లాడ గ్రామానికి చెందిన తుమ్మలపల్లి స్వరాజ్యం (55) కు గత కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతూ నవీన హాస్పిటల్ డాక్టర్ ప్రణయ్ కలవడం జరిగింది డాక్టర్ ప్రణయ్ స్కానింగ్ పరీక్షలు నిర్వహించి కడుపులో 6 కేజీల అండషాతిత్తిని గుర్తించి ఆపరేషన్ చేసి తొలగించారు ప్రస్తుతం స్వరాజ్యం ఆరోగ్యం మెరుగ్గా ఉందని నవీన హాస్పిటల్ వైద్యులు తెలిపారు