ఎస్ ఎస్ మరియు బి ఈ ఏస్ ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ మహమ్మద్ రఫీ కి అరుదైన గొప్ప అవకాశం
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
కేంద్ర ప్రభుత్వం మరియు ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా ఏప్రిల్ 8న ఢిల్లీలో నిర్వహించు చున్న జీ 20 సమ్మిట్ (గ్లోబల్ 20 దేశాల సదస్సు) 20 దేశాల ప్రతినిధుల సభలో వివిధ రంగాలలో విశేష సేవలందించిన వ్యక్తులకు మరియు తెలుగు రాష్ట్రాల నుంచి సామాజిక కార్యకర్త ఎస్ ఎస్ ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహమ్మద్ రఫీ ని వక్త మరియు గౌరవ అతిధి గా పాల్గొనవలసిందిగా ఆహ్వాన పత్రిక మరియు మంచినీటి ఆవశ్యకత అనే అంశం మీద మాట్లాడే అరుదైన అవకాశం లభించింది. 20 దేశాల నుండి 320 మంది వక్తలు 24 గంటలలో తమ తమ సందేశాన్ని ఇవ్వవలసి ఉంటుంది. ఈ అరుదైన అవకాశాన్ని చేజిక్కించుకున్న మహమ్మద్ రఫీని పలువురు ప్రముఖులు అభినందించారు.