శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీలో గల మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ప్రజా పాలన కేంద్రం ను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా పాలన కార్యక్రమంను సద్వినియోగం చేసుకోవాలని, అర్హులైన పేద, మధ్యతరగతి ప్రజలకు అందేలా చూడలని, దరఖాస్తు చేసుకోదలచిన వారు తమ డివిజన్లలో ఏర్పాటుచేసిన కార్యాలయం నందు ప్రత్యేక కౌంటర్ల లో వారికి కావలసిన పథకానికి సంబంధించినవి దరఖాస్తు ద్వారా అక్కడికక్కడే అధికారులకు ఇచ్చి రసీదు పొందాలని సూచించారు.. ఇందులో ప్రధానంగా..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన 28.12.23 నుండి 06.1. 24 వరకు నిర్వహించడం జరుగుతుంది అని, దీనిలో భాగంగా పథకాలైన మహాలక్ష్మి(గ్యాస్ సిలెండర్-500 మరియు 2500 నగదు), గృహ జ్యోతి (200 యూనిట్ల కరెంటు రాయితీ),ఇందిరమ్మ ఇల్లు, చేయూత(ఫించన్లు) వంటి పథకాలకు సంబంధించి దరఖాస్తు చేసుకోదలచినవారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒకే దరఖాస్తు ద్వారా తమ యొక్క పథకమును అప్లై చేసుకుని మీ యొక్క స్థానిక ప్రాంతాల్లో నియమించబడిన కార్యాలయాల్లో ఇవ్వాలని సూచించారు అలాగే… ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల సౌకర్యాలు కలిపించాలని, మంచినీరు అందించాలని శాంతి భద్రతలు విషయంలో పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు .
ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ,ప్రజాప్రతినిధులు,అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు ఈ కార్యక్రమం పై విస్తృతంగా అవగహన కలిపించాలని, అర్హులైన వారందరికీ ,నిజమైన లబ్ధిదారులకు ,పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందేలా చూడలసిన బాధ్యత మన అందరి పై ఉంది అని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.ప్రతి డివిజన్ కి నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగినది అని ,స్ర్రీలకు ,పురుషులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది అని ,అవసరమైతే జనాభా ప్రాతిపదికన ఎక్కువ జనసాంద్రత ఉన్న చోట మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు.నిజమైన లబ్ధిదారులకు పథకాలు అందేలా చూడాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని , పేదల జీవితాలలో వెలుగు నింపే కార్యక్రమం అని , సమస్యలు కోసం కూడా వచ్చే వారి నుండి ప్రత్యేక కౌంటర్లు వినతులు తీసుకోవాలని, పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని అవసరమైతే మరింత సమయం ను పొడిగించాలని ,అందరి సమిష్టి కృషితో ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.
ప్రజాపాలన కార్యక్రమం 28 డిసెంబర్,2023 నుండి 6 జనవరి, 2024 తేదీ వరకు కేంద్రాలలో ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలను సంబందించిన అన్ని రకాల ఫారాలు అందుబాటులో ఉంచి,వాటికీ సంబందించిన అధికారులు, మా సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారని, ప్రజలందరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహ జ్యోతి,చేయూత గ్యారంటీల లబ్దికొరకు అప్లై చేసుకోవచ్చు.మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల రూ.2500 ఆర్థిక సహాయం,500 రూపాయలకే గ్యాస్ సిలిండర్,రైతు భరోసా పథకం కింద ప్రతి ఏటా రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15000 రూపాయలు,ప్రతి ఏటా వ్యవసాయ కూలీలకు 12000 రూపాయలువరి పంటకు 500 రూపాయల బోనస్,ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద ఇల్లు లేనివారికి ఇంటి స్థలం, 5 లక్షల రూపాయల సాయం,ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు 250 చదరపుగజాల ఇంటి స్థలం,గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్,చేయూత పథకం కింద నెలకు 4000 రూపాయల పింఛన్ మరియు దివ్యాంగులకు 6000 రూపాయల పింఛన లబ్దికొరకు అప్లై చేసుకోవచ్చు.
దరఖాస్తు చేసుకొనుటకు కావలసిన పత్రాలు:
- ఆధార్ కార్డ్ జిరాక్స్
- తెల్ల రేషన్ కార్డు జిరాక్స్
- ఒక పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
ముఖ్యగమనిక: అప్లికేషన్ ఫారం తప్పులు లేకుండా పూర్తి చేసి అర్హులైన వారు 28 డిసెంబర్ 2023, నుండి 6 జనవరి, 2024 దరఖాస్తు చేసుకొనగలరు
ఈ కార్యక్రమంలోమాజీ కౌన్సిలర్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వీరేశం గౌడ్, శేరిలింగంపల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్, వార్డ్ మెంబర్ శ్రీకళ, పద్మారావు, బసవయ్య, గోపాల్ యాదవ్, గడ్డం రవి యాదవ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, జమ్మయ్య, యోగి, సుభాష్ రాథోడ్, సౌజన్య, భాగ్యలక్ష్మి, శశికళ, సుధారాణి, మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబంధిత జిహెచ్ఎంసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.