పటాన్చెరు డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్న కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్….
*సమస్యలకు త్వరలోనే పరిష్కారం చేస్తాం…. మెట్టు కుమార్ యాదవ్.
పటాన్చెరు డివిజన్ పరిధిలోని రజక బస్తీలో ఈరోజు ఉదయం కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్ పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా కార్పొరేటర్ బస్తీలోని ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
డ్రైనేజీ సమస్య అలాగే దొంగతనాలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు కోరగా, త్వరలోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని కార్పొరేటర్ హామీ ఇవ్వడం జరిగింది. GHMC అధికారులతో కార్పొరేటర్ వెంటనే మాట్లాడి, డ్రైనేజీ సమస్యను శిఘ్రమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించడం జరిగింది.
- అనంతరం గొల్లబస్తీలో పర్యటించిన కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ కాలనీవాసులతో చర్చించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు సమస్యను స్థానికులు కార్పొరేటర్ కి తెలియజేయగా, నిర్మాణం ఆగిపోయిన సిసి రోడ్డు పనులు పూర్తి చేయిస్తానని, అలాగే మిగతా వీధులలో కూడా నూతన సిసి రోడ్ల నిర్మాణం చేయిస్తామని కార్పొరేటర్ హామీ ఇవ్వడం జరిగింది.