హైదరాబాద్: ఉన్నత చదువుల కోసం కెనడా కు వెళ్లిన హైదరాబాద్ వాసి కార్డియాక్ అరెస్టుతో ప్రాణాలు కోల్పోయాడు. అతడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు సాయం చేయాలంటూ ఆ విద్యార్థి కుటుంబం కేంద్ర మంత్రి ఎస్. జైశంకర్‌ను అభ్యర్థించింది.
హైదరాబాద్‌కు చెందిన 25 ఏళ్ల షేక్ ముజమ్మిల్ అహ్మద్ 2022లో కెనడా వెళ్లాడు. ఒంటారియాలోని కొనెస్టోగా కాలేజీలో ఐటీ మాస్టర్స్ చదువుతున్నాడు. వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్న అతడు.. శుక్రవారం కార్డియాక్ అరెస్టు తో మృతిచెందాడు. అతడి స్నేహితుడు కుటుంబసభ్యులకు ఫోన్ చేసి సమాచారమిచ్చినట్లు ఎంబీటీ పార్టీ అధికార ప్రతినిధి అజ్మద్ ఉల్లా ఖాన్ సోషల్ మీడియాలో వెల్లడించారు. అహ్మద్ కుటుంబసభ్యులు కేంద్ర విదేశాంగ శాఖకు రాసిన లేఖను కూడా ఆయన పోస్ట్ చేశారు. వీలైనంత త్వరగా మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని కేంద్రాన్ని కోరారు.
ఇటీవల హైదరాబాద్‌కు చెందిన మరో విద్యార్థి అమెరికాలోని చికాగోలో దాడికి గురైన సంగతి తెలిసిందే. ఈ నెల ఆరంభంలో లంగర్‌హౌజ్ హషీమ్‌నగర్‌కు చెందిన సయ్యద్ మజాహిర్ అలీపై దుంగడులు దాడి చేశారు. తీవ్ర గాయాలతో.. తనపై జరిగిన దాడిని అలీ వీడియో ద్వారా వెల్లడించారు. అతడికి అవసరమైన సాయం అందిస్తామని చికాగోలోని భారత ఎంబసీ హామీ ఇచ్చింది…..
హైదరాబాద్ వాసి కార్డియాక్ అరెస్టుతో ప్రాణాలు కోల్పోయాడు
Related Posts
కాలిఫోర్నియాతో పాటు ఇతర రాష్ట్రాల్లో సుమారు ఎనిమిది
SAKSHITHA NEWS కాలిఫోర్నియాతో పాటు ఇతర రాష్ట్రాల్లో సుమారు ఎనిమిది ట్రిలియన్ గ్యాలన్ల మేర వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా తుపాను ప్రభావంపై అంచనా వేయడానికి ప్రత్యేక వ్యవస్థను రూపొందించిన కాలిఫోర్నియా యూనివర్సిటీ వరద ముప్పు ఉన్న ప్రాంత ప్రజలు…
కామన్వెల్త్ పార్లమెంటరీ మహాసభల్లో ఏపీ స్పీకర్
SAKSHITHA NEWS కామన్వెల్త్ పార్లమెంటరీ మహాసభల్లో ఏపీ స్పీకర్ ఏపీ రాష్ట్ర శాసనవ్యవస్థలో ఆధునిక సమాచార,సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగంలోకి తెస్తున్నామని శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఆస్ట్రేలియా దేశం సిడ్నీలో జరుగుతున్న 67వకామన్వెల్త్ పార్లమెంటరీ మహా సభల్లో ‘ఉత్తమ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం-ప్రతిష్ఠ’…