వికారాబాద్
వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెల 16న కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ, పదివేల మందితో కాంగ్రెస్ పార్టీలో చేరనున్న BRS ముఖ్య నాయకులు.
కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నేపథ్యంలో పార్టీ నాయకుల మీడియా సమావేశం ఈ సందర్భంగా మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ… గత ఎన్నికలలో BRS పార్టీ విజయానికి కారకులైనటువంటి ముఖ్య నాయకులు కొండల్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, ముత్తార్ షరీఫ్ పదివేల మందితో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేయబోతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పవనాలు జోరుగా వీస్తున్నాయని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని.. పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు కొత్తగా జాయిన్ అవుతున్న నాయకులు కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ తో పాటు మాజీ ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్రారెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ అర్థ సుధాకర్ రెడ్డి పార్టీ నాయకులు పాల్గొన్నారు.