తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కలను సాకారం చేసిన గొప్ప నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బేగంపేట లోని పాటిగడ్డ లో తెలంగాణ భవన్ వరకు సాగే భారీ బైక్ ర్యాలీని ప్రారంభించారు. పాటిగడ్డ నుండి తెలంగాణ భవన్ సమీపంలోని బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ వరకు సుమారు 5 కిలోమీటర్ల దూరం MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ బైక్ నడిపి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా KCR 2001 సంవత్సరంలో TRS పార్టీని స్థాపించి రాష్ట్ర సాధన కోసం అనేక పోరాటాలు, ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. అయినప్పటికీ నాటి పాలకులు స్పందించకపోవడంతో తెలంగాణ వచ్చుడో… KCR సచ్చుడో అనే నినాదంతో 2009 సంవత్సరంలో కరీంనగర్ జిల్లాలో KCR ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారని పేర్కొన్నారు.
ఈ ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిందని అన్నారు. KCR ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమాలు, పోరాటాలకు అన్ని పార్టీలు, అన్ని వర్గాల ప్రజలు పూర్తి మద్దతు తెలిపారని చెప్పారు. ఎన్నో సంవత్సరాల కల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి KCR చరిత్రలో గొప్ప నాయకుడిగా నిలిచారని అన్నారు. KCR ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి 15 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో దీక్షా దివస్ వేడుకలను జరుపుతున్నట్లు తెలిపారు. ఈ ర్యాలీలో రాష్ట్ర యువ నాయకులు తలసాని సాయి కిరణ్ యాదవ్, BRS అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, హన్మంతరావు, ఆకుల హరికృష్ణ, కొలన్ బాల్ రెడ్డి, గుర్రం పవన్ కుమార్ గౌడ్, అత్తిలి మల్లికార్జున్ గౌడ్, వివిధ డివిజన్ లకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.