ఘనంగా బోనాల పండుగ
కొన సాగుతున్న దుర్గా దేవి నవరాత్రులు
కొడిమ్యాల: అక్టోబరు 7( )
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రము,మరియు వివిధ గ్రామాల్లో దుర్గాదేవి నవరాత్రులు ఘనంగా యువకులు,హనుమాన్ సేవా సమితి,వందేమాతరం ఫ్రెండ్స్ యూత్, జయ దుర్గా సేవా సమితి, తదితర యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మంటపాల వద్ద పూజలు నిర్వహించారు. వందే మాతరం ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో సోమవారం ఐదవ రోజు దుర్గాదేవీ మహా చండీ దేవి రూపం లో భక్తులకు దర్శనం ఇచ్చారు.అనంతరం బోనాల పండుగను అల్పోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి, ఎస్ ఐ సందీప్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా సునీల్ భవానీ బృందం చే అంగ రంగ వైభవంగా బోనాల తో మహిళలు ఊరేగింపు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్యాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చైర్మన్ గడ్డం జీవన్ రెడ్డి,నాయకులు పిడుగు ప్రభాకర్ రెడ్డి, చంద్ర మోహన్ రెడ్డి, బింగి మనోజ్, దుర్గా మాత ప్రముఖులు కొమురవెల్లి రాకేష్, బైరి రవి, ఏనుగు ఆదిరెడ్డి, బైరి వెంకటి, వందే మాతరం ఫ్రెండ్ యూత్ సభ్యులు, భవానీ మాతలు, భక్తులు ,ప్రజలు పాల్గొన్నారు.