SAKSHITHA NEWS

పల్నాడు జిల్లా నరసరావుపేటలో రెచ్చిపోతున్న గంజాయి ముఠా

ఏపీలో 400 గంజాయి చాక్లెట్ల కలకలం

సాక్షిత నరసరావుపేట

తెలుగు రాష్ట్రాలలో గంజాయి ముఠా రెచ్చిపోతోంది. ప్రధానంగా కాలేజీ, స్కూలు విద్యార్థులనే టార్గెట్ చేసి గంజాయిని చాకెట్లుగా తయారుచేసి విక్రయిస్తున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఓ షాపు పై పోలీసులు దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో 175 గ్రాముల గంజాయితో పాటు 400 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాకు చెందిన ఉదయానంద్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.


SAKSHITHA NEWS