అయ్యప్పమాల వేసుకున్న విద్యార్థిని వేధించిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి – ABVP
- అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థిని పరీక్షల రాయకుండా వెనకకు పంపిన స్కూల్ యాజమాన్యం.
- ఎబివిపి నిరసనతో దిగి వచ్చిన యాజమాన్యం. క్షమాపణలు కోరుతూ లేఖ.
అఖిల భారతీయ విద్యార్ధి పరిషద్ మేడ్చల్, కొంపల్లి నగర శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఉన్న ఢిల్లీ వరల్డ్ పబ్లిక్ స్కూల్లో అయ్యప్ప స్వామి మాల ధరించిన విద్యార్థి పట్ల మత వివక్ష చూపిస్తూ విద్యార్థుల్లో వ్యతిరేక భావాలను పెంపొందిస్తున్న ఢిల్లీ వరల్డ్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యంపై ధర్నా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎబివిపి మేడ్చల్ జిల్లా కన్వీనర్ నగేష్ మాట్లాడుతూ కులం, మతం అనే తేడా లేకుండా ప్రతి విద్యార్థికి చదువుకునే హక్కుని భారత రాజ్యాంగం కల్పించింది, విద్యార్థుల్లో ఏకత్వాన్ని అనగ తొక్కుతూ మరియు మత వివక్షతో దేశ వ్యతిరేక భావాలను పెంపొందిస్తున్న పాఠశాలలపై ప్రభుత్వం వెంటనే దృష్టి సాదించి రైట్ టు ఎడ్యుకేషన్ మరియు రైట్ టు రిలీజియన్ కి సంబంధించిన నియమ నిబంధనలతో కూడిన జీవో అమలు చేయాలి. రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించిన ఢిల్లీ వరల్డ్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యంపై ఎంఈఓ మరియు డీఈవో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దిగొచ్చిన స్కూల్ యాజమాన్యం వారి స్కూల్ దృష్టిలో అన్ని కులాల వారు, మతాలవారు ఒకటేనని జరిగిన సంఘటనకు క్షమాపణ కోరుతూ నోటీస్ విడుదల చేసింది.
ఈ కార్యక్రమంలో కూకట్పల్లి విభాగ్ కన్వీనర్ శ్రీనాథ్ కొంపల్లి నగర కార్యదర్శి నాగేంద్ర,సిటీ కార్యవర్గ సభ్యుడు వివేక్,శ్రీకాంత్,శ్రీశాంత్,నితిన్,తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు.