లావేరులో అవినీతి చేప చిక్కింది.
శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలోని హౌసింగ్ విభాగంలో వర్క్ ఇన్స్ పెక్టర్ గా మజ్జి కన్నంనాయుడు పనిచేస్తున్నారు.అదే మండలంలోని వాలిపేట గ్రామానికి చెందిన లబ్ధిదారులు కిల్లారి కృష్ణకి హౌసింగ్ ఫైనల్ బిల్లు మంజూరు చేయడం కోసం వర్క్ ఇన్స్ పెక్టర్ కన్నంనాయుడు రూ 13వేల రూపాయలు లంచం డిమాండ్ చేసారు.అంతపెద్ద మొత్తం లంచంగా ఇవ్వడానికి ఇష్టం లేని కృష్ణ ఏసిబి అధికారులను ఆశ్రయించారు.ఆ మేరకు ఏసిబి శ్రీకాకుళం డిఎస్పీ రమణమూర్తి ఆద్వర్యంలో సిబ్బంది పక్కా ప్రణాళికతో దాడి చేసారు.లావేరు హౌసింగ్ కార్యాలయంలో వర్క్ ఇన్స్ పెక్టర్ కన్నంనాయుడు రూ13వేల రూపాయలను కృష్ణ నుంచి తీసుకుంటుండగా ఏసిబి అధికారులు పట్టుకున్నారు.లంచంగా తీసుకున్న నగదును స్వాధీనం చేసుకున్నారు.ఈ మేరకు వర్క్ ఇన్స్ పెక్టర్ కన్నంనాయుడును వారు అదుపులోకి తీసుకున్నారు. విశాఖపట్నంలోని ఏసిబి కోర్టులో హాజరుపరుస్తామని డిఎస్పీ రమణ మూర్తి వెల్లడించారు.