తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి జరుగనున్న సమగ్ర కులగణన కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో వివేకానంద నగర్ లోని సప్తగిరి కాలనీ లో గల PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ఇంటికి డీసీ కృష్ణయ్య మరియు GHMC అధికారులు స్టిక్కర్ అంటించడం జరిగినది.
ఈ సందర్భంగా PAC చైర్ గాంధీ మాట్లాడుతూ దేశ చరిత్రలో తొలి సారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సమగ్ర కుల గణన చేపట్టడం జరిగినది అని, చాలా గొప్ప విషయం అని, ఎన్నో ఏండ్ల కళ నెటీతో నెరవేరునని , సమగ్ర కులగణన చేపట్టడం హర్షించదగ్గ విషయం అని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నాం అని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.
ఈ సమగ్ర కులగణన ద్వారా బడుగు బలహీన వర్గాలకు, వెనుకబడిన తరగతుల కులాల జాబితాను సిద్ధం చేసి అభివృద్ధి ఫలాలు అందరికి అందేలా మంచి నిర్ణయం తీసుకోవడం జరిగినది అని , శుభపరిణామం అని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.
అధికారులు ఖచ్చితత్వం తో కూడిన సర్వే నిర్వహించాలని, ఎక్కడ ఏ పొరపాటు జరుగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, అన్ని జాగ్రత్తలు పాటించాలని ఎమ్మెల్యే గాంధీ అధికారులకు సూచించారు.
ప్రజలు కూడా కులగణన కోసం వచ్చిన అధికారులకు పూర్తిగా సహకరించాలని ,నిజాలు మాత్రమే చెప్పాలని అప్పుడే సరైన కుల జాబితా రూపొందుతుంది అని ,ప్రతి ఒక్కరు కులగణన కార్యక్రమంలో పాల్గొని పూర్తి వివరాలు అందించాలని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.