SAKSHITHA NEWS

నిరుపేదలకు వరం ముఖ్యమంత్రి సహాయక నిధి

ఎమ్మెల్యే సత్యనారాయణ రావు సహకారంతో బాధితుడికి 2.50 లక్షల ఎల్ ఓ సి అందజేత

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కి కృతజ్ఞతలు తెలిపిన బాధిత కుటుంబం.
నిరుపేదల ఆరోగ్య పరిరక్షణకుకు ముఖ్యమంత్రి సహాయక నిధి వరం లాంటిదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ అన్నారు.
టేకుమట్ల మండలం రామకృష్ణాపూర్ (v)
గ్రామానికి చెందిన అల్లకొండ కొమురయ్య కి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ సహకారంతో
సీఎం సహాయ నిధి ఎల్ఓసి ద్వారా రెండు లక్షల 50 వేలు మంజూరు చేయించి,గురువారం బాధితుడి భార్యకు అందజేశారు.


ఈ సందర్భంగా సతీష్ గౌడ్ మాట్లాడుతూ,కొమురయ్య అనారోగ్యంతో (కిడ్నీ సంబంధిత వ్యాధి) హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రిలో చేరగా,హాస్పటల్ ఖర్చులకు డబ్బులు లేక నిస్సహాయక స్థితిలో ఉండడాన్ని తెలుసుకున్న సతీష్ గౌడ్, విషయాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించిన ఆయన, 2.50 లక్షలు మంజూరు చేయించి ఆ కుటుంబానికి అండగా నిలిచి.ఎల్ఓసి చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు.
మండలం నుంచి ఇప్పటికే అనేక మంది సీఎం సహయనిది ద్వారా లబ్ధి పొందారని.అనారోగ్యంతో ఉన్న వారికి ఆర్థిక సాయం అందజేస్తున్న ఎమ్మెల్యే సత్యనారాయణ దృష్టికి , తమ సమస్యను తీసుకువెళ్లి. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన సతీష్ గౌడ్ కి కొమరయ్య కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దొంతుల శ్రీనివాస్ ఉన్నారు తదితరులు ఉన్నారు.


SAKSHITHA NEWS