SAKSHITHA NEWS

సాక్షిత : ఎమ్మెల్యే కె పి వివేకానంద్ 93వ రోజు ‘ప్రగతి యాత్ర’లో భాగంగా 125 డివిజన్ గాజులరామారం పరిధిలోని హెచ్ ఏ ఎల్ కాలనీ మరియు ఆదర్శ్ నగర్ లలో పర్యటించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలనీలో పూర్తి చేసిన రోడ్లు, డ్రైనేజీ వంటి అభివృద్ధి పనులు పరిశీలించారు. అదే విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయో ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన వారు అందరు ప్రభుత్వ పథకాలను సద్వినియోగ పరుచుకోవాలని కోరారు, కాగా తమ కాలనీలకు నిధుల కొరత లేకుండా ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించినందుకు తమ కాలనీ అభివృద్ధి సంక్షేమ సంఘం వారు కలిసికట్టుగా పనిచేయాలని కాలనీలో ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకొనివస్తే, సమస్యల పరిష్కారం చేస్తానని తెలియచేసారు.

అనంతరం కాలనీవాసులు అడిగిన వెంటనే తమ కాలనీలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే కి పుష్పాలతో ఘన స్వాగతం పలికి సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. మిగిలి ఉన్న చిన్నపాటి పనులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ఎమ్మెల్యే మిగిలిన పనుల కోసం వెంటనే వ్యయప్రణాళికలు రూపొందించి వాటిని పూర్తి చేయడానికి వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో అధికారులు HMWS DGM అప్పల నాయుడు , DEE రూప దేవి, పాక్స్ డైరెక్టర్ శ్రీనివాస్ యాదవ్, కాలనీ అధ్యక్షులు అడ్వకేట్ కమలాకర్, ఆంజనేయులు , సుబ్బా రాయుడు, మూర్తి, చారీ,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కస్తూరి బాలరాజ్, నవాబ్, సింగారం మల్లేష్, అబిద్, చెట్ల వెంకటేష్,ఇమ్రాన్ బైగ్, దూలప్ప,మహిళా అధ్యక్షురాలు సంధ్య రెడ్డి, వీరయ్య చౌదరి, చిన్న చౌదరి, బాలరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,ఖయ్యుమ్,దయాకర్, కృష్ణ, గోపాల్, బాబు రెడ్డి, గోపాల్ రెడ్డి మరియు ఇతర శాఖ అధికారులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS