74th Republic Day Celebrations
ఘనంగా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
జాతీయ పతాకావిష్కరణ చేసిన జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్
శ్రీకాకుళం జిల్లాలో వైభవంగా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో జరిగాయి.ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ముఖ్య అతిథిగా హాజరై పతాకావిష్కరణ చేసి పోలీసు దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా ప్రజలనుద్దేశించి జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిని వివరించారు. కార్యక్రమంలో కోటబొమ్మలి మండలం, తిలారు గ్రామానికి చెందిన స్వతంత్ర సమర యోధులు మంత్రి అప్పల రామయ్య,భార్య అప్పలనరసమ్మలకు దుశ్శాలువాతో సత్కరించి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
అదేవిధంగా రవాణా, మత్స్య,వ్యవసాయ, పశుసంవర్ధక, విద్యా, మహిళ, శిశు అభివృద్ధి సంస్థ, విపత్తు స్పందన, అగ్నిమాపక, నీటిపారుదల, ఉద్యాన శాఖ, గిరిజన సహకార సంస్థ, సీతంపేట సేంద్రియ అటవీ వ్యవసాయ ఉత్పత్తులు, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్ ను తిలకించారు. అనంతరం వివిధ శాఖల సంక్షమా, అభివృద్ధి పధకలు లబ్దిదారులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖలలో ఉత్తమ సేవలు అందించిన 221మంది అధికారులకు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శంచిన విద్యార్థిని, విద్యార్థులకు ప్రసంశా పత్రాలు, జ్ఞాపికలు జిల్లా కలెక్టర్ అందజేసారు,
74వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో
ప్రగతిని చాటిచెప్పిన ప్రగతి శకటాల ఆకర్షణగా నిలిచాయి. పౌరసరఫరాలు, గృహనిర్మాణ, సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ, వైద్య ఆరోగ్య, 104,108, వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి సంస్థ, విద్య, జలవనరులు, జలజీవన్ మిషన్, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, విపత్తులు అగ్నిమాపక శాఖలు ఆయా విభాగాల ప్రగతిని తెలియజేస్తూ శకటాల ప్రదర్శన అందరినీ ఆకర్షించాయి. శకటాల ప్రదర్శనలో డ్వామా శకటానికి మొదటి స్థానం, RWS ద్వితీయ స్థానం, గృహ నిర్మాణ శాఖ తృతీయ స్థానం కైవసం చేసుకున్నారు. సంబంధిత శాఖాధికారులకు కలెక్టర్ జ్ఞాపికలు అందజేశారు. అలాగే నృత్య ప్రదర్శనల్లో గార కె.జి.బి.వి స్కూల్ కి మెదటి బహుమతి, కళ్లేపల్లి సాంప్రదాయ గురుకులానికి ద్వితీయ స్థానం, రణస్థలం ఎన్.ఇ. ఆర్. స్కూల్ తృతీయ స్థానం కైవసం చేసుకున్నారు.
ఈ గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో సూపరింటెండెట్ ఆఫ్ పోలీస్ జి.ఆర్.రాధిక, జాయింట్ కలెక్టర్లు ఎం.నవీన్, డి.ఎఫ్.ఓ నిషాకుమారి, టెక్కలి సబ్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి, డివిజినల్ రెవెన్యూ అధికారి బొడ్డేపల్లి శాంతి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, పలు పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
స్పాట్ వాయిస్ : జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్.