SAKSHITHA NEWS

రి.నం. 87/2018 తేదీ 13-03-2023 రోజున హుజురాబాద్ నియోజకవర్గం కుమ్మరి సంఘం అధ్యక్షులు చెల్పూరి కొమురయ్య గారి ఆధ్వర్యంలో జమ్మికుంట గాంధీ చౌరస్తా వద్ద శ్రీ శ్రీ శ్రీ ఆత్మకూరు ముల్లమాంబ గారి 583 వ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది అధ్యక్షులు మాట్లాడుతూ ముల్లమాంబ జయంతి ద్వారా కుమ్మరి కులస్తులలో ఐక్యత పెంపొందించాలని ఈ కార్యక్రమం అధికారికంగా నిర్వహించారు ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బావండ్లపల్లి రవీందర్ గారు మాట్లాడుతూ కుమ్మర్లకు అన్ని రంగాలలో అవకాశాలు మరియు సబ్సిడీ మీద కుల పనిముట్లు అందజేయాలని కోరారు గౌరవ అధ్యక్షులు తాటికంటి భూమయ్య గారు మాట్లాడుతూ 50 సంవత్సరాలు దాటిన కుమ్మరి వృత్తిదారులకు పెన్షన్ అందజేయాలని కోరారు ఉపాధ్యక్షులు ఆకారపు పాపయ్య మరియు ఆరుట్ల రాజయ్య మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేద కుమ్మరి కులస్తులకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని కోరారు మహిళా విభాగం కార్యదర్శి ఇటికాల స్వరూప మరియు సిలువేరు సంపత్ గారు మాట్లాడుతూ ప్రతి మండలానికి కుల కమ్యూనిటీ భవనం నిర్మించాలని కోరారు తాటికంటి మల్లేశం గారు మోత్కులగూడెం కుమ్మరి సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ ప్రతి మండల కేంద్రంలో కుండలు అమ్ముకోవడానికి స్థలం కేటాయించాలని కోరారు మర్రిపల్లి రాజయ్య విలాసాగర్ సమ్మయ్య గారు మాట్లాడుతూ బీహార్ ఒరిస్సాలలో లాగా కుమ్మర్లను బీసీఏలో చేర్చాలని కోరినారు లింగాల రాజకుమార్ శనిగరపు తిరుపతి తాటికంటి ప్రకాష్ మాట్లాడుతూ కుమ్మర్లకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో కుమ్మరి శాలివాహన ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ రాజనీతి శాస్త్ర ఉపన్యాసకులు మలిశెట్టి కుమార్ ముల్ల రామాయణం తెలుగు సాహిత్యానికి చేసిన సేవ గురించి వివరించారు ఈ కార్యక్రమంలో సిలువేరు రాజు ఇజ్జిగిరి సంపతి ఇజ్జిగిరి శీను వరికాలు చంద్రశేఖర్ గుండారపు ఐలయ్య ఆకారపు రాకేష్ గుండారపు అశోక్ గుండారపు మొగిలి వరికాలునారాయణ నాంపల్లి మొగిలి బావండ్లపల్లి శంకర్ ఆకారపు చిరంజీవి తాటి కంటి మధునయ్య తాటి కంటి తిరుపతి తాటి కంటి సతీష్ రాజు తాటికంటి మొగిలి గుండారపు రాజయ్య తాటికంటి మల్లేష్ చిలువేరు గణపతి మొదలైన వారు మరియు 50 మంది కుమ్మరి కులస్తులుపాల్గొన్నారు.


SAKSHITHA NEWS