కొండాపూర్ డివిజన్ పరిధిలోని సిద్దిక్ నగర్ లో 5 అంతస్థుల భవనం అకస్మాత్తుగా ఒక పక్కకు ఒరిగినది.విషయం తెలియగానే సంఘటన స్థలానికి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి కార్పొరేటర్ హమీద్ పటేల్ , GHMC ,DRF సిబ్బంది ,పోలీసు అధికారులతో కలిసి పరిశీలించి , అర్థరాత్రి వరకు ఉండి సహాయక చర్యల్లో పాల్గొని బాధిత కుటుంబాలకు భరోసాను కల్పించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ సిద్దిక్ నగర్ లో సెల్లార్ గుంతలోకి భవనం వంగడం జరిగినది. విషయం తెలియగానే సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగినది , GHMC పోలీస్, DRF ,విద్యుత్ ,అగ్నిమాపక అన్ని శాఖల అధికారులను అప్రమత్రం చేసి, సమన్వయం చేసుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని , సెట్ బ్యాక్ లేకుండా పక్కన సెల్లార్ తవ్వడం వలనే పక్క భవనం ఒక వైపు వంగిపోయినది అని, దీని వలన కాలనీ వాసులు భయబ్రాంతులకు గురి అయినది అని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు. భవనం చుట్టుపక్కల ప్రజలను సురక్షిత ప్రాంతలకు తరలించడం జరిగినది. అక్రమంగా తీసుతున్న సెల్లార్ ల పై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ,అనుమతి లేకుండా తీస్తున్న సెల్లర్లను వెంటనే ఆపివేయాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలను తీసుకోవాలని , భవిష్యత్తులో ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా అన్ని రకాల చర్యలను తీసుకోవాలని అధికారులను PAC చైర్మన్ గాంధీ ఆదేశించడం జరిగినది.
కాలనీ వాసులు ఎటువంటి భయబ్రాంతులకు గురి కావొద్దు అని, అన్ని రకాల స్వీయ రక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గాంధీ భరోసా కల్పించారు.అక్రమ నిర్మాణాలు, అక్రమ సెల్లారు లు తవ్వే వారి విషయంలో ఎటువంటి ఉదాసీనత పాటించకూడదు అని, కఠిన చర్యలు తీసుకోవాలని , ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదు అని ,ప్రజలకు ఇబ్బందులకు గురి చేసే వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇంజనీరింగ్ నిపుణుల సలహా తీసుకున్న తర్వాత బిల్డింగ్ కూల్చి వేయాల లేదా అనేది నిర్ణయం తీసుకుంటామని, ప్రస్తుతానికి ఎటువంటి ప్రమాదం లేకుండా ముందస్తు చర్యలో భాగంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగినది అని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.