SAKSHITHA NEWS

అటవీ ప్రాంతం నుండి దారి తప్పి పొలాల్లోకొచ్చిన 5కృష్ణ జింకలు, స్పృహ తప్పి పడిపోయి ఒక జింక మృతి

ప్రకాశం జిల్లా పెద్దోర్నాల్లోని స్థానిక మణికంఠ వెనుక భాగంలో గల పొలాల్లో అటవీ ప్రాంతం నుంచి దారితప్పి వచ్చిన ఐదు కృష్ణ జింకలు పొలానికి రక్షణ కోసం పొలం చుట్టూ ఇనుప కంచ ఏర్పాటు చేయటంతో ఎటు వెళ్లాలో అర్థం కాని జింకలు పొలంలోనే ఇటు అటు తిరగటంతో ఐదు జింకలలో ఒక జింకకు స్పృహ తప్పి పడిపోయింది, సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది, హుటాహుటిన జింకలు ఉన్న పొలం దగ్గరికి వెళ్లి పడిపోయిన జింకకు ప్రాథమిక చికిత్స చేసి గ్లూకోస్ అందించినప్పటికీ ఫలితం కనిపించలేదు,

అపస్మారక స్థితిలోకి చేరుకున్న జింక అక్కడికక్కడే చనిపోవడంతో అటవీ శాఖ సిబ్బంది స్థానిక గణపతి ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద జింక కలే బరాన్ని భద్రపరిచారు,పొలానికి ఉన్న ఇనుపకంచెను తొలగించడంతో మిగిలిన నాలుగు కృష్ణ జింకలు అటవీ ప్రాంతంలోనికి క్షేమంగా వెళ్లిపోయాయి, అని పెద్దదో నాలా అటవీ శాఖ అధికారి విశ్వేశ్వరరావు తెలియజేశారు, గ్రామ రెవెన్యూ అధికారి, అటవీశాఖ సిబ్బంది, ఆధ్వర్యంలో గణపతి చెక్పోస్ట్ వద్ద పశు వైద్యులు జుబేర్చే పోస్టుమార్టం నిర్వహించి దహనం చేయనున్నట్లుఅటవీ శాఖ అధికారి విశ్వేశ్వరరావు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎఫ్ ఎస్ ఓ చెన్నయ్య, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మస్తాన్వలితదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS