తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని వివి మహాల్ రోడ్డు వద్ద గల ముస్లింల శ్మశానవాటిక ఖబరస్తాన్ లో ఆధునికరించిన అనంతరం తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, కమిషనర్ అదితి సింగ్ ఐఏఎస్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్, తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్ధి భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ ముస్లింలకు తగిన ప్రాధాన్యత వైసిపి ప్రభుత్వంలోనే కనబడుతున్నదన్నారు. రానున్న కాలంలో ముస్లింల అభివృద్దికి మరింత కృషి చేస్తామన్నారు.
తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అదితి సింగ్ మాట్లాడుతూ 39 లక్షలతో వివి మహాల్ రోడ్డు వద్ద గల ముస్లింల శ్మశానవాటికలో అవసరమైన షెడ్డును, కాంపౌండ్ గోడలు నిర్మించడం, ఆర్చ్ తో కూడిన షెడ్డును, ఫెవర్స్ నిర్మించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు ఎస్.కె.బాబు, మునిసిపల్ కార్పొరేషన్ కో ఆప్షన్ సభ్యులు ఇమామ్ సాహేబ్, ఖాదర్ భాష, కార్పొరేటర్ నరేంద్ర, మునిసిపల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ తిరుమాలిక మోహన్, మునిసిపల్ ఇంజనీర్ వెంకట్రామిరెడ్డి, డిఈ విజయకుమార్ రెడ్డి, నాయకులు హాజి ఫరీధ్, మౌలనా ఇబ్రహీమ్ హాస్మీ, ముస్తీ సమీవుల్లా, ఏటిజే మాళిక్, టౌన్ బ్యాంక్ డైరెక్టర్ చోటూ బాయ్, చానూ బాయ్, దినేష్ రాయల్ తదితరులు పాల్గొన్నారు.