SAKSHITHA NEWS

సాక్షిత*తిరుపతి నగరం:
టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి ముత్యాల రెడ్డిపల్లెలో సాయంత్రం వైఎస్సార్ ఆసరా వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిత్ర పటానికి డ్వాక్రా సంఘాల అక్క చెల్లెమ్మలు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా డ్వాక్రా సంఘాల ప్రతినిధులను ఉద్దేశించి భూమన కరుణాకర రెడ్డి ప్రసంగిస్తూ గత ఎన్నికల్లో అక్క చెల్లమ్మల డ్వాక్రా రుణాలను నాలుగు విడతలుగా మాఫీ చేస్తామని వాగ్దానం చేసిన జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని తెలిపారు.

అక్క చెల్లెమ్మలకు వైఎస్సార్ ఆసరా కింద రాష్ట్ర వ్యాప్తంగా 35 వేల కోట్ల రూపాయలు నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేశారని తెలిపారు. తిరుపతిలోనే 126 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందన్నారు. అంతే కాకుండా సంక్షేమ పథకాల ద్వారా మూడు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు నేరుగా మీ ఖాతాల్లో జమ చేశారని చెప్పారు.‌ ధనికులపై వేసిన పన్నులను పేద అక్క చెల్లెమ్మల సంక్షేమానికే ఖర్చు చేస్తున్నారని తెలిపారు. ఓ పక్క పేదలు, మరో పక్క చంద్రబాబు పవన్ కల్యాణ్ కూటమికి మధ్య ఈ ఎన్నికల్లో యుద్ధం జరగనుందని అన్నారు. సంక్షేమ పథకాల్ని రద్దు చేయాలని పని గట్టుకుని వస్తున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు ఓట్లు వేస్తే మీరు ఓడిపోతారని అన్నారు.

బాబు వస్తే జాబు వస్తుందని, అక్క చెల్లెమ్మల అప్పులను తీర్చేస్తానని, విద్యార్థులకు ట్యాబ్ లు, సైకిళ్లు ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, అధికారం లోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీనీ కూడా నిలబెట్టు కోలేదని గుర్తు చేశారు. జగనన్నకు ఓట్లు వేస్తే పేదలు విజయం సాధిస్తారని, మరింత గొప్పగా జగనన్న సంక్షేమ పథకాలు అమలు చేస్తారని భూమన తెలిపారు. జగనన్న ఆశీస్సులతో తిరుపతిని దేశంలోనే ఓ ఆదర్శ నగరంగా తీర్చిదిద్దామని భూమన కరుణాకర రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన హ్యాండ్ వాష్ మిషన్ని ఎమ్మెల్యే భూమన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ, స్టాండింగ్ కమిటి సభ్యులు ఎస్.కె.బాబు, కార్పొరేటర్లు ఆరణి సంధ్య, పైడి సునీత, సులోచనా శేఖర్ రెడ్డి, మోహనకృష్ణ యాదవ్, పొన్నాల చంద్ర, తిరుత్తణి శైలజ, తాళ్ళూరి రత్నకుమారి, కోటూరి ఆంజినేయులు, మెప్మా మిషన్ మేనేజర్ కృష్ణవేణి, నాయకులు దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, వెంకటమునిరెడ్డి, మబ్బు నాధమునిరెడ్డి, డిష్ చంద్ర, తూకివాకం మహీధర్ రెడ్డి, కుమార్, గంగులమ్మ, అనీల్, బ్రహ్మానందం, అమరనాధ రెడ్డి, మాకం చంద్ర, తలారి రాజేంద్ర, వంశీ తదితరులు పాల్గొన్నారు

Whatsapp Image 2024 01 30 At 6.51.34 Pm

SAKSHITHA NEWS