సాక్షిత, : ఈ నెల 31 నుండి 9 వ తేదీ వరకు నిర్వహించే గణేష్ నవరాత్రి వేడుకలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. బుధవారం ఖైరతాబాద్ వినాయక మండపం వద్ద వివిధ శాఖల అధికారులతో కలిసి ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు పండుగలు, వేడుకలను ఘనంగా జరుపుకోవాలనేది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచన అని పేర్కొన్నారు. అందులో భాగంగానే ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని పండుగలను నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. గణేష్ నవరాత్రుల సందర్భంగా భక్తులు, నిర్వహకులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. ఖైరతాబాద్ వినాయకుడు అంటే తెలియని వారు ఉండరని, ఎంతో ప్రసిద్ధి చెందిన ఇక్కడ ప్రతిష్టించే గణనాధుడిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి లక్షలాది మంది వస్తారని అన్నారు. దానిని దృష్టిలో ఉంచుకొని పటిష్టమైన భారీకేడ్ లను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. నవరాత్రులు ముగిసే వరకు వాహనాల రాకపోకలను నిలిపివేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరా లో అంతరాయం ఏర్పడకుండా జనరేటర్ లను అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. తాత్కాలిక టాయిలెట్స్ లను కూడా అందుబాటులో ఏర్పాటు చేయాలని GHMC అధికారులను ఆదేశించారు. ఈ పరిసర ప్రాంత ప్రజల ఇబ్బందుల దృష్ట్యా మండపం వెనుక రోడ్డులో వారం రోజులలో నూతన రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. హైదరాబాద్ లో నిర్వహించే గణేష్ నవరాత్రులు, గణేష్ నిమజ్జనం వేడుకలకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణ లో భాగంగా ఈ సంవత్సరం GHMC, HMDA, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ల ఆధ్వర్యంలో 6 లక్షల మట్టి విగ్రహాలను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ప్రశాంత వాతావరణంలో వేడుకలు నిర్వహించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. శాంతిభద్రతల నిర్వహణలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆదర్శంగా ఉందని అన్నారు. మినీ ఇండియా గా పిలవబడే హైదరాబాద్ నగరంలో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు చాలా బాధాకరం అని పేర్కొన్నారు. ప్రజలు కూడా ఆవేశాలకు లోను కాకుండా సంయమనంతో ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రసన్న, జోనల్ కమిషనర్ రవి కిరణ్, DC మోహన్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారి డాక్టర్ వెంకట్, వాటర్ వర్క్స్ ENC కృష్ణ, R&B EE రవీంద్ర మోహన్, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు సుదర్శన్ తదితరులు ఉన్నారు
ఈ నెల 31 నుండి 9 వ తేదీ వరకు నిర్వహించే గణేష్ నవరాత్రి వేడుకలకు ప్రభుత్వం
Related Posts
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తాం – మాజీ ఎమ్మెల్యే, శ్రీశైలం గౌడ్
SAKSHITHA NEWS కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తాం – మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్.. కుత్బుల్లాపూర్ నియోజక వర్గం: మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నేత కూన శ్రీశైలం గౌడ్ ని తన నివాసం వద్ద…
ప్రభుత్వ వైద్య సేవలు మెరుగుపరచాలి: ఎంపీడీవో వెంకయ్య గౌడ్, స్పెషల్ ఆఫీసర్ సురేష్
SAKSHITHA NEWS ప్రభుత్వ వైద్య సేవలు మెరుగుపరచాలి: ఎంపీడీవో వెంకయ్య గౌడ్, స్పెషల్ ఆఫీసర్ సురేష్ శంకర్పల్లి: ప్రభుత్వ వైద్య సేవలు మెరుగుపరచాలని శంకర్పల్లి ఎంపీడీవో వెంకయ్య గౌడ్, స్పెషల్ ఆఫీసర్ సురేష్ అన్నారు. శనివారం ఎంపీడీవో కార్యాలయంలో వైద్య అధికారులతో…