కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని 307 సర్వే నెంబర్ లో గల ప్రభుత్వ భూమి ఎన్ని ఎకరాలు ?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినంక కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 307 లో ఎన్ని ఎకరాలు ఉండే ? ప్రస్తుతం ఎన్ని ఎకరాలు ఉంది ? 307 సర్వే నెంబర్ లో ఎస్ఎఫ్సి ఎన్ని ఎకరాలు ఉంది ? 307 బై నంబర్స్ లో ప్రభుత్వ భూమి ఎన్ని ఎకరాలు ఉంది ? ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉంది అనేది రెవిన్యూ అధికారులు ఏరోజైనా సర్వే చేసి చూసారా ఎన్ని ఎకరాలు ఉందొ అధికారులకైనా తెలుసా ? 307 సర్వే నంబర్స్ లో ఎన్ని బస్తిలు వెలిసినయ్ ? ఎన్ని కన్స్ట్రక్షన్ కంపెనీలు వెలిసినయ్ ? వీటి వెనుక సూత్రదారులు ఎవరు ? పాత్రదారులు ఎవరు ? ప్రభుత్వ భూముల రక్షణ లో అధికారులు ఎందుకు చొరవ చూపించట్లేదు ? మీడియా లో ఎన్ని కదనాలు వచ్చిన చూసి చూడనట్టు వ్యవహారం ఎందుకు ? ఏమర్వో, ఆర్డివో సైతం కలెక్టర్ ఆదేశాలు పాటించలేదు అనే పుకార్లు ఉన్నాయ ? ఎంత మొత్తం లో ప్రభుత్వ భూమి కబ్జాకి గురైంది ? ఎంత మిగులు భూమి ఉంది ? మిగిలిన ప్రభుత్వ భూమి కైన రక్షణ ఉందా ? అంటే పై వాటి అన్నిటికి కాలమే సమాధానం చెబుతుందా? వేచి చూడాలి మరి.
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app
SAKSHITHA NEWS
DOWNLOAD APP