3 (three) transformers are required to overcome the voltage problem
ఓల్టేజ్ సమస్యను అధిగమించడానికి అవసరాల రిత్యా 3 (మూడు) ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలి: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”
సాక్షిత : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ “మీతో నేను” కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ మండల పరిధిలోని పాతూర్ గ్రామంలో ఉదయం 07:00 AM నుండి 11:00 AM వరకు పర్యటించారు.
◆ పాతూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇండ్లకు మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు మరియు విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖల వారికి ఆదేశించారు.
◆ గ్రామంలో లో… ఓల్టేజ్ సమస్య ఉన్నందువలన గ్రామంలో 25 KV ట్రాన్స్ఫార్మర్ మరియు వ్యవసాయ భూములకు 25 KV రెండు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని, గ్రామంలో డ్యామేజ్ అయిన స్తంభాలను తొలగించాలని, పంట పొలాల్లో వేలాడుతున్న విద్యుత్ వైర్లను సరిచేయాలని మొదలైన విద్యుత్ సమస్యలు పరిష్కారం చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.
◆ గ్రామంలోని మిషన్ భగీరథ నీటి ట్యాంకును నెలలో 1, 11, 21వ తేదీలలో కచ్చితంగా శుభ్రం చేయాలన్నారు.
◆ గ్రామంలో కొత్తగా అండర్ డ్రైనేజీ నిర్మాణానికి కృషి చేద్దామన్నారు.
◆ గ్రామంలో ఎప్పటికప్పుడు శానిటేషన్ నిర్వహిస్తూ… గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
◆ గ్రామ ప్రజలు తడిచెత్త, పొడిచెత్త వేరుచేసి, గ్రామపంచాయతీ ట్రాక్టర్లో వేయడం, ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవడం, మరుగుదొడ్లు నిర్మించుకొని, వాటిని వాడుకలో ఉంచుకుంటున్న పాతూరు గ్రామ ప్రజలను అభినందిస్తూ… కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.