29.00 Lakhs in Allapur Society under Hyder Nagar Division
సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అల్లపూర్ సొసైటీ లో 29.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న సి సి రోడ్ పనులను జిహెచ్ఎంసి అధికారులు మరియు కాలనీ వాసులతో కలసి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు . ఈ సందర్భంగా నార్నె శ్రీనివాసరావు మాట్లాడుతూ,
సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గదర్శకం లో మంత్రి KTR మరియు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సహకారం తో హైదర్ నగర్ డివిజన్ ను, అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన, అగ్రగామి డివిజన్‌గా తీర్చిదిద్దుతానని నార్నె శ్రీనివాసరావు పేర్కొన్నారు.
అదేవిధంగా హైదర్ నగర్ డివిజన్ లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని, సీసీ రోడ్ల వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని, ప్రజలకు ట్రాఫిక్ రహిత, సుఖవంతమైన, మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తానని,అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని నార్నె శ్రీనివాసరావు చెప్పడం జరిగినది,
అలానే పనుల్లో జాప్యం లేకుండా త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నార్నె శ్రీనివాసరావు అధికారులను ఆదేశించడం జరిగినది. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలిపిస్తామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు చెప్పడం జరిగినది, అలానే డివిజన్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని
, అన్ని వేళల్లో ప్రజలకు అందుబాటులోకి ఉంటానని, మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని, డివిజన్ ను ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దుతానని కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, కాలనీ వాసులు మహేష్ రెడ్డి, అప్పిరెడ్డి, రావూరి శ్రీనివాస్, సంగమేశ్వర రావు, శ్రీనివాస్ రెడ్డి,, కొండారెడ్డి, రవికుమార్, శ్రీనివాస్, వెంకటరామారావు తదితరులు పాల్గొన్నారు.