SAKSHITHA NEWS

ప్రజారోగ్యానికి అ­త్యంత ప్రాధాన్యమిస్తూ డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరో­గ్యశ్రీకి ఊపిరిలూదిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారని ప్రభుత్వవిప్ సామినెని ఉదయభాను అన్నారు.

జగ్గయ్యపేట పట్టణం, స్థానిక ప్రభుత్వ హాస్పటల్ నందు పట్టణంలోని 6, 9 సచివాలయ పరిధిలోని లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వవిప్ శాసనసభ్యులు సామినేని ఉదయభాను ఆరోగ్య శ్రీ కార్డులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ర్టంలో వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీతో రూ.లక్షలు ఖరీదైన వైద్యం పూర్తి ఉచితంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నారు అని అన్నారు. గతంలో ఆరోగ్యశ్రీ ద్వారా ఐదు లక్షల మించి వైద్యం చేసేవారు కాదని అన్నారు. నేడు 25 లక్షలు వరకు పెంచుతూ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రజలకు ఎలా అయితే నాణ్యమైన వైద్యాన్ని అందించారో నేడు అదే బాటలో జగన్మోహన్ రెడ్డి నడుస్తూ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఆరోగ్యశ్రీ క్రింద ఉచిత వైద్యసేవలు పొందడం ఎలా అనేదానిపై ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు తదితర అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2024 01 04 At 2.58.23 Pm

SAKSHITHA NEWS