కర్నూలు జిల్లా…
216 వాహనాల వేలం .
వివిధ నేరాల్లో, అక్రమంగా మద్యం తరలిస్తూ పట్టుబడిన కేసుల్లో సీజ్ చేసిన మొత్తం 216 వాహనాలకు ఏప్రిల్ 10 న (సోమవారం), ఏప్రిల్ 11 న (మంగళవారం) వేలం నిర్వహించబడుతుందని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ తెలిపారు.
164 వాహనాలకు కర్నూలు తాలుకా పోలీసుస్టేషన్ లో
52 వాహనాలకు సి.బెళగల్ పోలీసుస్టేషన్ లో వేలం వేయనున్నారు.
ఉదయం 10 గంటలకు ఆయా పోలీసు అధికారుల సమక్షంలో వాహానాల వేలం ప్రారంభమవుతుంది.
ఆసక్తి ఉన్న వారు అదే రోజున తగిన ధరావత్తు చెల్లించి వేలం పాటలో పాల్గొనవచ్చు.
వాహనాల వేలంలో పాల్గొనదలచిన వారు ఖచ్చితంగా క్రింది సూచనలు పాటించాలని జిల్లా ఎస్పీ తెలిపారు.
మొదట గా వేలం పాట ప్రారంభకాక ముందే తగిన ధరావత్తు చెల్లించి టోకెన్ తీసుకోని వేలం పాటలో పాల్గొనాలన్నారు.
ఆధార్ కార్డు ఖచ్చితంగా జిరాక్స్ తెచ్చుకోవాలన్నారు.
వేలం పాటలో దక్కించుకున్న వాహనం కు సంబంధించిన వాహానం ధర మొత్తం ను అదే రోజు సంబంధిత అధికారులకు చెల్లించి వాహనాలు స్వాధీనపరచుకోవచ్చన్నారు.