దగదర్తి మండలం, ఉలవపాళ్ళ పంచాయతీలోని 20 కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఉలవపాళ్లలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, టీడీపీ – బీజేపీ – జనసేన ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బానాయుడు, టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఉలవపాళ్ళ హరిజనవాడలో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ గా పోటీచేసిన నెల్లూరు సాల్మాన్ ఆధ్వర్యంలో 20 కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి టిడిపి బీద రవిచంద్ర, కావ్య క్రిష్ణారెడ్డి పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు.. బాణాసంచా పేల్చి, పూల వర్షం కురిపిస్తూ, మేళ తాళాలతో ప్రజలు ఘన స్వాగతం పలికారు. ప్రతి ఇంటికి తిరిగి కరపత్రాలు పంచుతూ టీడీపీ – బీజేపీ – జనసేన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డిని గెలిపించాలని కోరారు.
20 కుటుంబాలు వైసీపీ ని వీడి టీడీపీలో చేరిక
Related Posts
అధికారం ఉంది కదా అని ఒక వ్యవస్థను నాశనం
SAKSHITHA NEWS అధికారం ఉంది కదా అని ఒక వ్యవస్థను నాశనం చేయాలని చూసి బొక్క బోర్లా పడి అదే వ్యవస్థను పర్యవేక్షించే పరిస్థితికి వచ్చిన ఒక అధికారి!! కట్టెలు అమ్మిన చోటే కట్టెలు కొట్టుకునే పరిస్థితి!! పేదలకు గుప్పెడు అన్నం…
25న వాయుగుండం.
SAKSHITHA NEWS 25న వాయుగుండం. ఏపీలో దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల మీదుగా గురువారం ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది పశ్చిమ వాయవ్యదిశగా పయనించి ఆగ్నేయ బంగాళాఖాతంలో 23 నాటికి అల్ప పీడనంగా…