30 లక్షల విలువగల 2 కార్లు, 16 బైక్స్ సీజ్ చేసిన సూర్యాపేట 2 వ పట్టణ పోలీసులు. 3 నింధితుల అరెస్ట్.
*
జిల్లా పోలీసు కార్యలయం నందు నిర్వహించిన ప్రెస్ మీట్ నందు అధనపు ఎస్పీ నాగేశ్వరావు, పట్టణ ఇన్స్పెక్టర్ వీర రాఘవలు తో కలిసి కేసుల వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ IPS గారు.*
1) ఇద్దరు అంతరాష్ట్ర దొంగల నుండి 2 కార్లు, 4 బైక్స్ స్వాదినం
నింధితుల వివరాలు .
A1 : కొరపాటి నర్సింగ్ రావు వయస్సు: 44 సంవత్సరాలు, Occ: రియల్ స్టేట్ బిజినెస్, ఇందిరమ్మనగర్, సికింద్రాబాద్.
A2 : బాత ప్రసాద్, వయస్సు: 39 సంవత్సరాలు, Occ: రియల్ ఎస్టేట్ వ్యాపారం, బంధలుప్పి గ్రామం , పార్వతిపురం (M) AP రాష్ట్రంలోని పరవతిపుయం మన్యం జిల్లా.
కొరపాటి నర్సింగరావు, బాత ప్రాసాద్ లు ఇద్దరు కలిసి కార్లు అద్దెకు తీసుకుని మార్గం మద్యలో డ్రైవర్ తో కలిసి మద్యం తాగి డ్రైవర్ మత్తులోకి వెళ్ళగానే కార్లు దొంగతనం, లిస్ట్ అడిగి డ్రైవర్ మార్గం మద్యలో అవసరాలకోసం కారు, బైక్స్ ఆపితే ఆధును చూసి వాహనాలు ఎత్తుకెళ్లడం చేస్తుంటారు. ఇలా 2 కార్లు, 4 బైక్స్ దొంగతమ్ చేశారు.
16-11-2024 వ తేదీన సూర్యాపేట పట్టణం బాలాజీనగర్ కు చెందిన మర్రు వెంకటేశ్వరరావు వయస్సు: 56 సంవత్సరాలు, Occ: వ్యవసాయం, సూర్యాపేట పట్టణ పిఎస్ కు వచ్చి 27.10.2024న విజవాడలో చదువుతున్న తన కుమార్తె వద్దకు తన ఎర్టీగా కారులో వెళుతుండగా సుమారు 13.30 గంటల సమయంలో సూర్యాపేట టౌన్‌లోని కొత్త బస్టాండ్‌కు చేరుకోగా ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు లిఫ్ట్ అడిగారు, వారికి లిఫ్ట్ఇచ్చాను వారు నాతో మాటలు కలిపి పోన్ నబర్స్ కూడా మార్పు చేసుకున్నాము, సుమారు 18.00 గంటలకు విజయవాడ చేరుకున్నాము తన కుమార్తె కోసం ఏవైనా తినడానికి కొనడానికి స్టార్టింగ్ స్థితిలో తన కారును పార్క్ చేశాడు. తినుబండారాలను కొనుగోలు చేసిన తర్వాత అతను తన కారు వద్దకు తిరిగి వచ్చే సరికి కారు కంనిపించలేదు. వెంటనే తన కారు కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా కనిపించలేదు, లిఫ్ట్ అడిగిన వారికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ చేయబడింది. నా అనారోగ్యంతో ఉండడం వల్ల వెంటనే పోలీస్ స్టేషన్‌కు రాలేకపోయానని ఈ విషయంలో చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరుతూ 16.11.2024న ఫిర్యాదు ఇచ్చాడు. పిర్యాదుపై సూర్యాపేట II పట్టణ పి.ఎస్. నందు Cr No .517/2024 U/s 318(4), 303(2) BNSలో కేసు నమోదు చేసి, సూర్యాపేటటౌన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కేసు దర్యాప్తు చేస్తున్నాము. తేదీ 18/12/2024 రోజున వాహనాలు తనికి చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానంగా తిరుగుతుండగా ఆధుపులోకి తీసుకుని విచారించగా వారు వాహనాలు దొంగతనానికి పాల్పడుతున్నామని ఒప్పుకున్నారు. కార్లు అద్దెకు తీసుకుని మార్గం మద్యలో డ్రైవర్ తో కలిసి మద్యం తాగి డ్రైవర్ మత్తులోకి వెళ్ళగానే కార్లు దొంగతనం చేస్తునట్లు ఒప్పుకున్నారు. అలాగే పార్క్ చేసిన బైక్ లను సైతం నఖిలి తాళం తో లేదా, తాళం పగలగొట్టి బైక్ దొంగతనాలు చేస్తున్నామని ఒప్పుకున్నారు. వీరి నుండి ఒక ఎర్టీగా (TS 29 G 9459) కారు, ఒక ఇన్నోవా (AP 05 TG 2377) కారు, స్ప్లెండర్, యూనికార్న్, పల్సర్, యాక్టివా మొత్తం నాలుగు బైక్స్ స్వాదినం చేసుకుని నింధితులను రిమాండ్ కు తరలించడం జరిగినది. నింధితుడు ప్రసాద్ పై గతంలోయి విశాఖపటనం లో 2 కేసులు ఉన్నాయి.
ఒక దొంగ నుండి 12 బైక్స్ స్వాదినం చేసుకున్నా సూర్యాపేట 2వ పట్టణ పోలీసులు, దొంగ అరెస్ట్, రిమాండ్.
నిందితుడు : గుంగంటి శ్రీకాంత్, వయసు 23 సంవత్సరాలు, Huzurnagar. ఇతడు కాలేజీలు, హాస్పటల్స్ వద్ద పార్క్ చేసిన వాహనాలను నకిలీ తలంతో టేసి దొంగతనాలు చేస్తునట్లు
ఆత్మకూరు మండలానికి చెందిన విద్యార్ధి గుణగంటి మహేష్ వెంకన్న, వయస్సు: 22 సంవత్సరాలు, 07.12.2024 రోజున సూర్యాపేట పట్టణం లో గల స్పందన డిగ్రీ కాలేజీలో పరీక్ష రాయద్దానికి వచ్చి తన ప్యాషన్ ప్లస్ బైక్ ను కళాశాల ముందు పార్క్ చేసి పరీక్ష పూర్తయిన తర్వాత సా.5 గంటలకు తన బైక్ వద్దకు వచ్చి చూడగా బైక్ కనిపించడం లేదు, తన బైక్ గురించి పరిసర ప్రాంతాల్లో వేటాకు అని దొరకలేదు అని 16-12-2024 రోజున సూర్యాపేట పట్టణ 2వ PS నందు ఫిర్యాదు చేశాడు. ఫలించలేదు. తన వ్యక్తిగత పని కారణంగా వెంటనే పీఎస్‌లో ఫిర్యాదు చేయడం లేదు. తన బైక్ చోరీకి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ఫిర్యాదుదారుడు కోరాడు. దీనిపైసూర్యాపేట II పట్టణ పి.ఎస్. Cr No .557/2024 U/s 303(2) BNSలో కేసు నమోదు చేసి, సూర్యాపేట II టౌన్ పోలీస్ కేసును దర్యాప్తు చేసారు. దర్యాప్తు లో భాగంగా ఈరోజు అనగా 18-12-2024న, సూర్యాపేటటౌన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ & అతని సిబ్బంది కొత్త బస్టాండ్ వద్ద వాహనాలు తనికి చేస్తుండగా ఒక వ్యక్తిని అనుమానాస్పద పరిస్థితుల్లో పట్టుకున్నారు, విచారించగా గుంజ శ్రీకాంత్ వయసు 23 సంవత్సరాలు, హుజూర్ నగర్ కు చెందిన వ్యక్తిగా గుర్తించ డమ్ జరిగినది. ఆధుపులోకి తీసుకుని దర్యాప్తు చేయగా కాలేజీలు, హాస్పటల్స్ వద్ద పార్క్ చేసిన వాహనాలను నకిలీ తలంతో టేసి దొంగతనాలు చేస్తునట్లు ఒప్పుకున్నాడు. ఇతనిని వద్ద నుండి 12 కేసుల్లో 12 బైక్స్ స్వాదినం చేసుకుని నింధితుణ్ణి రిమాండ్ కు తరలించడం జరిగినది.
ఈ కేసుల పర్యవేక్షణ పని చేసిన DSP రవి, చేదనలో బాగా పనిచేసిన సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వీర రాఘవులు, ఎస్సైలు ఆంజనేయులు, ఏడుకొండలు, కుశలవ, సైదులు, టెక్నికల్ సిబ్బంది కర్ణాకర్, కృష్ణ, శివ, సుధాకర్, రవి, మధు లను ఎస్పి అభినందించి రివార్డ్ లు అందించారు.