SAKSHITHA NEWS

16ఏండ్లు… 34సార్లు…
అత్యవసర సమయంలో రక్తదానంతో ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న హెడ్ కానిస్టేబుల్ రమేష్

సాక్షాత సూర్యపేట జిల్లా ప్రతినిధి : 16ఏండ్ల కాలంలో 34సార్లు అత్యవసర సమయంలో రక్తదానం చేసి ఎందరో ప్రాణాలను నిలిపి ఎంతో మంది ఆదర్శంగా నిలుస్తున్నారు సూర్యాపేటకు చెందిన హెడ్ కానిస్టేబుల్ పాలెల్లి రమేష్..ఏ పాజిటివ్ రక్తం కావాల్సిన వారికి అందుబాటులో ఉంటూ అత్యవసర సమయాల్లో రక్తదానం చేస్తూ తన వంతు సమాజ చేస్తున్నారు రమేష్..కరోన సమయంలో ఒకే ఏడాదిలో నాలుగు సార్లు రక్తదానం చేయగా రక్త కొరత లేకుండా సోషల్ మీడియా లో అన్ని రకాల గ్రూప్ లకు చెందిన వివిధ వర్గాలకు చెందిన వారితో గ్రూప్ ఏర్పటూ చేసి రక్తదానం చేసేందుకు నిత్యం అందుబాటులో ఉండే విదంగా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు..

అదే విదంగా ప్రతి సంవత్సరం అనాథ పిల్లలకు ఉచిత నోట్ బుక్స్ అందిస్తూన్నారు. అంతేకాకుండా ఇంటింటికి తిరిగి పాత బట్టలను సేకరించి అనాథ ఆశ్రమంలో ఉన్న వారికి అందించి తన దౌతృత్వాన్ని చాటుకుంటున్నడు.. ఖాళీ సమయాల్లో వంట చేస్తూ వచ్చిన ఆదాయంతో చదువుకోలేని పేద పిల్లలను చదివిస్తూ సేవ గుణాన్ని చాటుకుంటున్నారు.. అవయవ దానంపై ప్రజలలో అవగాహన కల్పిస్తూ అవయవాలు దానం చేసేందుకు ముందుకు వచ్చేలా తన వంతు కృషి చేస్తున్నారు..హైదరాబాద్ కు చెందిన జీవన్ ధర్ సంస్థకు తన మరణాంతరం అవయవాలను దోనెట్ చేసేందుకు అగ్రిమెంట్ సైతం అందించారు రమేష్..


SAKSHITHA NEWS